టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత కాలంలో కొత్త తరం రాక మరింత పెరిగిందనే చెప్పాలి. యువ నటులు, దర్శకులు, నిర్మాతల వంటివారు ఎక్కువగా వస్తుండడం వలన క్రియేటివిటీ కూడా బాగా పెరగడం, అలానే మంచి క్వాలిటీతో కూడిన సినిమాలు రావడం జరుగుతోందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల సైడ్ యాక్టర్ నుండి పూర్తి స్థాయి హీరోగా మారిన యువ నటుడు శ్రీవిష్ణు. వాస్తవానికి మొట్టమొదట యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ ద్వారా మంచి పేరు సంపాదించిన శ్రీ విష్ణు, ఆ తరువాత నారా రోహిత్ నటించిన బాణం మరియు సోలో సినిమాల్లో చిన్న పాత్రల ద్వారా నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. 

ఇక ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలలో మెరిసిన శ్రీవిష్ణు, నారారోహిత్ తో కలిసి అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాడు. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ రోహిత్ తో పాటు విష్ణు కూడా నటుడిగా మంచి పేరు సంపాదించాడు. ఇక అక్కడినుండి వరుసగా మా అబ్బాయి, మెంటల్ మదిలో, నీది నాది ఒకటే కథ, వీర భోగ వసంత రాయలు, బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం వంటి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని నటుడిగా మంచి పేరుతో ముందుకు సాగుతున్నాడు. 

ఇక ఇటీవల ఒక మీడియా వెబ్సైట్ పెట్టిన ఆడియన్స్ ఒపీనియన్ పోల్ లో శ్రీవిష్ణు, యువ స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య వంటి వారందరినీ వెనక్కు నెట్టి అత్యధిక ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడట. మన హీరోల్లో ఎవరు ప్రస్తుతం డిఫరెంట్ గా క్యారెక్టర్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు అని ఈ పోల్ పెట్టడం జరిగిందట. వాస్తవానికి శ్రీవిష్ణు నటిస్తున్న సినిమాలు కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోతున్నప్పటికీ, వాటిలో ఎక్కువ శాతం సినిమాలు ప్రేక్షకులు సహా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: