ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో తొలిరోజు కలెక్షన్స్ సినిమాలకు చాలా ముఖ్యం. నిర్మాతలు సగం సేవ్ అవాలంటే  ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తే చాలు  బ్రతికి పోయినట్టే. అందుకే, సినిమాలకు ఓపెనింగ్స్ బాగా రాబట్టడం కోసం విడుదలకు ముందు విపరీతంగా పబ్లిసిటీ చేస్తారు. సినిమాకు మంచి బజ్ ఏర్పడాలంటే దానికి తగ్గట్టు మంచి ప్రమోషన్ తప్పనిసరిగా ఉండాలి. ‘ఏడు చేపల కథ’ టీం ఈ విషయంలో సక్సెస్ అయ్యింది.


ఇకపోతే ఈ సినిమాలో నటించిన హీరో, నటీనటులు కానీ.. దర్శకుడు, నిర్మాతలు కానీ.. అసలు ఈ చిత్రానికి పనిచేసిన ఏ ఒక్కరు గురించి కానీ ప్రేక్షకులకు తెలీదు. కానీ, బోల్డ్ కంటెంట్‌తో, అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను ఆకర్షించారు. టీజర్లు, ట్రైలర్‌తో విపరీతమై బజ్‌ను క్రియేట్ చేశారు. అదీకాకుండా సెన్సార్ దగ్గర ఆగిపోతుందనుకున్న సినిమాను ‘ఎ’ సర్టిఫికెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


ఇకపోతే ఈ గురువారం విడుదలైన ఈ సినిమా కథ విషయంలో ప్రేక్షకులు పెదవి విరిచినా తొలిరోజు కలెక్షన్లు మాత్రం దుమ్ము రేపాయి.ఇదిలా ఉండగా, ‘ఏడు చేపల కథ’ తొలిరోజు చేసిన బిజినెస్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఎందుకంటే.. ఈమధ్య విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇక గోపీచంద్ ‘చాణక్య’ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.1 కోట్ల షేర్ రాబట్టింది.


కార్తి ‘ఖైదీ’ అయితే రూ. 25 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక ‘ఆవిరి’ తొలిరోజు షేర్ రూ.13 లక్షలు. కానీ, ‘ఏడు చేపల కథ’ తొలిరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ రాబట్టింది. ఇంత చిన్న సినిమా అంత షేర్ రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమా పై సినీవర్గాల్లో చర్చ మొదలైంది.


వాస్తవానికి అడల్ట్ కంటెంట్ కోసమే చాలా మంది ఈ సినిమాకు వెళ్లారు. వెళ్లాక తెలిసింది ఇందులో ట్రైలర్లో చూపించిన విధంగా మసాల సీన్స్ ఏవి లేవని కాబట్టి రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోవడం ఖాయం. మరి, ఈ చిన్న సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: