‘సైరా’ హడావిడి నుంచి తేరుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న మూవీ కోసం మానసికంగా సిద్ధ పడుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించిన కీలక నటీనటుల ఎంపికతో పాటు ఈ మూవీకి సంబంధించిన సెట్స్ నిర్మాణం కూడ అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి.

ఈమూవీ కథ మొత్తం దేవాలయాల ప్రభుత్వ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ లో జరుగుతున్న అవినీతి చుట్టూ తిరిగే నేపధ్యంలో ఈ మూవీకి ఒక షాకింగ్ టైటిల్ ను కొరటాల శివ తన మనసులో అనుకుని దీనిపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి ‘గోవిందా హరి గోవిందా’ అన్న టైటిల్ ను కొరటాల అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మూవీ కథ అంతా సింహాచలం టెంపుల్ నేపధ్యంలో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తయారుచేయబడినది కాబట్టి వైష్ణవ సాంప్రదాయం ద్వనించేలా ఈ టైటిల్ కొరటాల ఆలోచనలోకి వచ్చింది అని అంటున్నారు. అయితే ఈ వార్త లీక్ అయిన ఒక్కరోజు పూర్తి కాకుండానే మెగా అభిమానులు ఈ టైటిల్ వార్తలు విని బెంబేలు పడిపోతున్నారు. 

దీనికి కారణం 1994 ప్రాంతంలో నాగార్జున రామ్ గోపాల్ వర్మలు కలిసి ‘గోవిందా గోవిందా’ టైటిల్ ద్వని వినపడుతోంది ఏమిటి అంటూ మెగా అభిమానులు ఖంగారు పడుతున్నారు. అప్పట్లో భారీ అంచనాలతో ‘శివ’ మూవీ రికార్డులను బ్రేక్ చేయాలని వర్మ నాగార్జునలు చేసిన ప్రయోగం భారీ ఫ్లాప్ గా మారింది. వాస్తవానికి కొరటాల మూవీలో చిరంజీవి గోవిందా ఆచార్య అనే రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ఈ రెండు పాత్రల పేర్లకు సరిపడే విధంగా ‘గోవిందా హరి గోవిందా’ అన్న టైటిల్ ను కొరటాల అనుకుంటే దీనికి అనుకోని విధంగా మెగా అభిమానులు నాగార్జున ఫెయిల్యూర్ సెంటిమెంట్ గుర్తుకు చేసుకోవడం ఒక విధంగా షాకింగ్ న్యూస్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: