‘సాహో’ షాక్ నుండి తేరుకున్న ప్రభాస్ ఎట్టకేలకు తన లేటెస్ట్ మూవీ ‘జాను’ పై దృష్టి సారించి ఈ మూవీ స్క్రిప్ట్ లో చాల మార్పులు తిరిగి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ‘సాహో’ అనుభవాలతో ఈ మూవీ బడ్జెట్ విషయంలో కూడ కోతలు పెట్టి యూరప్ లో జరగవలసిన ఒక భారీ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో యూరప్ వాతావరణం ఉండే విధంగా ఒక సెట్ ను డిజైన్ చేసి ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించాడు.

1980 ప్రాంతంనాటి ఒక ప్రేమ కథ నేపధ్యంలో అప్పటి కాలాన్ని ప్రతిబింబించే వాతావరణంలో ఈమూవీని తీస్తున్నారు. ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆ సక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ పెర్ఫ్యూమ్ మేకర్ పాత్రలో కనిపిస్తాడని టాక్. 

ప్రభాస్ తయారుచేసే పెర్ఫ్యూమ్స్ కు  అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ మూవీలో ప్రభాస్ చుట్టూ అనేకమంది అమ్మాయిలు కనిపిస్తూ అతడిని ప్రేమలోకి దింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. అయితే ప్రభాస్ దృష్టి మాత్రం పూజహేగ్దే పైనే ఉంటూ ఈ కథలో అనేక ట్విస్ట్ లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ మూవీలోని హీరో పాత్ర స్వభావం విన్నవారికి కొన్ని నెలలు క్రితం రిలీజ్ అయిన నాగార్జున ‘మన్మధుడు 2’ లోని నాగ్ పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ మూవీలో కూడ నాగార్జున పెర్ఫ్యూమ్ మేకర్ గా కనిపిస్తాడు. నాగ్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా మారిన ఆ పాత్ర ఛాయలు ప్రభాస్ లేటెస్ట్ మూవీలో కనిపించడం యాధృశ్చికమే అయినా ప్రభాస్ మూవీకి నాగార్జున ఫ్లాప్ సెంటిమెంట్ ఏమిటి అంటూ ఈ లీకులు విని ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.. 
 
  


మరింత సమాచారం తెలుసుకోండి: