రానా దగ్గుబాటి వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రజలకు బాగా చేరువైన నటుడు. బాహుబలితో తన విశ్వరూపం చూపించిన రానా ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా 'హిరణ్య కశ్యప' సినిమాతో ప్రేక్షుకులకు ముందుకు రాబోతున్నారు. అయితే దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి గత కొన్ని నెలల్లో ఎన్నో ఊహాగానాలు నడిచాయి. అతడి కిడ్నీ సమస్య తీవ్ర రూపం దాల్చిందని.. ఆరోగ్యం బాగా దెబ్బ తిందని.. కోలుకోవడానికి సమయం పడుతుందని.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రావడం కష్టమని.. ఇలా ఎన్నో రూమర్లు వినిపించాయి. ఇవి ఎంత వరకు నిజమో ఏమో కానీ.. గత కొన్ని నెలలుగా రానా సినిమాలకు దూరంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. అతను మొదలుపెట్టిన.. మొదలు పెట్టాల్సిన సినిమాలు సందిగ్ధంలో ఉన్నాయి.


అయితే రానా పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది.  దీంతో రానా కమిటైన సినిమాల మేకర్స్‌లో మళ్లీ ఉత్సాహం వచ్చింది. ‘రుద్రమదేవి’ తర్వాత సినిమానే తీయకుండా.. రానాతో ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కించడం కోసం సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.రానా ఆరోగ్యంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కొన్ని నెలలుగా సైలెంటుగా ఉన్న గుణశేఖర్.. ఇప్పుడు ‘హిరణ్య కశ్యప’ అప్ డేట్‌తో వచ్చాడు.


సినిమా కోసం కావాల్సిన రచయితల కోసం .. నటుల కోసం గుణశేఖర్ పిలుపును ఇచ్చారు. ఆ సినిమా పేరెత్తకుండా చారిత్రక సినిమా కోసం పని చేసేందుకు తెలుగు భాషపై పట్టుకున్న రచయితలతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలని ట్విట్టర్లో పిలుపునిచ్చాడు. గుణశేఖర్ సన్నిహితుల సమాచారం ప్రకారం ‘హిరణ్య కశ్యప’ ప్రి ప్రొడక్షన్ మళ్లీ వేగం పుంజుకుందని.. స్క్రిప్టు చివరి దశలో ఉందని.. ఫైనల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నారని.. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు లాజిస్టిక్స్ ప్లానింగ్ లో ఉన్నారని.. అంతా అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: