తెలుగు సినిమా దర్శకుల్లో గుణశేఖర్ కు ప్రత్యేక శైలి ఉంది. సామాజిక అంశాలు, చారిత్రకం, హీరోయిజం, ప్రేమ, దేశభక్తి.. ఇలా తాను చేసింది తక్కువ సినిమాలే అయినా టచ్ చేయని జోనర్ లేదు. రుద్రమదేవిని సొంత ఖర్చుతో త్రీడీలో కూడా తీసి శెభాష్ అనిపించుకున్న గుణశేఖర్ కొన్నేళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణపనులు ఊపందుకున్నాయని సమాచారం.

 


హిరణ్యకశిప అనేది టినెటివ్ టైటిల్ మాత్రమే. దీనిపై పూర్తి కసరత్తు చేసిన గుణశేఖర్ ఇటివల ఓ ప్రకటన కూడా చేశాడు. తెలుగు భాషపై పూర్తి పట్టు ఉన్న నటీనటులు కావలెను అనే ప్రకటన కూడా ఇచ్చాడు. రుద్రమదేవికి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ తో ఈ సినిమా కోసం ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మాత సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. టైటిల్ రోల్ లో రానా నటిస్తున్నాడు. యావత్ సినీ పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లనుంది.

 


కంప్యూటర్ గ్రాఫిక్స్ ను, డీఐను తొలినాళ్లలో బాగా ఉపయోగించుకున్న వ్యక్తి గుణశేఖర్. అర్జున్ సినిమాలో తన పనితనం చూడొచ్చు. భారీ సెట్టింగ్స్ వేయడంలో కూడా గుణశేఖర్ దిట్ట. చూడాలని ఉంది సినిమాకు కోటి రూపాయలతో వేసిన కలకత్తా హౌస్ సెట్ అప్పట్లో ఓ సంచలనం. ఒక్కడుకు చార్మినార్ సెట్ సంచలనమైంది. అర్జున్ కు హైదరాబాద్ శివార్లలో వేసిన మధురై మీనాక్షమ్మ ఆలయం సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓ దశలో అగ్ర దర్శకుడిగా ముద్రపడిన గుణశేఖర్ తర్వాత పోటీ ఇవ్వలేకపోయాడు. కానీ వెర్సటైల్ దర్శకుడిగా ఇప్పటికీ తన మార్క్ చూపిస్తూనే ఉన్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: