అల వైకుంఠపురములో సినిమా పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచుతూ ఉండటంతో సరిలేరు నీకెవ్వరు
సినిమా పాటలు ఆ స్థాయిలో ఉంటాయా...? లేదా...? అని మహేష్ అభిమానులు కలవరపడుతున్నారు.
నిర్మాత అనిల్ సుంకర్ దేవీశ్రీ
ప్రసాద్ ఇచ్చిన పాటలు అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారని తెలుస్తోంది.
సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్
డిసెంబర్ నెల మొదటి వారం నుండి ప్రమోషన్స్ లో వేగం పెంచబోతుందని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి
దేవిశ్రీ ప్రసాద్ మధ్య గొడవల గురించి వస్తున్న వార్తలపై వీరిద్దరూ స్పందించి స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంథపురములో సినిమాలు
జనవరి 12వ తేదీనే విడుదలవుతాయని మేకర్స్ ప్రకటించినా రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.