ఒకేవిధమైన స్టొరీ లైన్ సినిమాలు వచ్చిన సందర్భాలు గతంలో చాలసార్లు జరిగాయి. తమ సినిమా కథ అప్పటికే నిర్మాణంలో ఉన్న మరో సినిమా కథతో పోలి ఉంది అని లీకులు వచ్చిన వెంటనే నిర్మాతలు తమ సినిమాల కథలను మార్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈసారి ఇలా చేయడం నాగచైతన్య అల్లు అర్జున్ లకు కుదరడం లేదు. 

చైతన్య వెంకటేష్ ల ‘వెంకీమామ’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీల కథలు వేరే అయినా ఆ మూవీలోని ఒక కీలక పాయింట్ ఒకేలా ఉండబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘వెంకీమామ’ మూవీలో వెంకటేష్ కు జాతకాలు అంటే విపరీతమైన నమ్మకం. తన మేనల్లుడు నాగచైతన్య మేనమామ గండంలో పుట్టాడు అని తెలిసినా వెంకటేష్ చైతన్యను వదులుకోలేక చైతన్యను చూసినప్పుడల్లా జాతక గండం గుర్తుకు వచ్చి భయపడుతూ ఉంటాడు. 

‘అల వైకుంఠపురములో’ మూవీలో కూడ అల్లు అర్జున్ తల్లితండ్రులు కోటీశ్వర్లు అయినప్పటికీ తమకు కొడుకుగా పుట్టిన బన్నీ వల్ల తమకు ఆర్ధిక నష్టాలు కలుగుతాయని ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని బన్నీని తమ డ్రైవర్ ఇంటిలో పెంచి డ్రైవర్ కొడుకును తమ ఇంటిలో తమ కొడుకుగా పెంచుకుంటారు. ఇక్కడ కూడ జాతకాల మూఢనమ్మకాలతోనే ఇలా జరుగుతుంది. 

దీనితో ‘వెంకీమామ’ ‘అల వైకుంఠపురములో’ మూవీ కథలు రెండు జాతకాల చుట్టూనే తిరుగుతాయి అని తెలుస్తోంది. అయితే ‘వెంకీమామ’ వచ్చేనెల విడుదల కాబోతోంది. దీనితో ప్రేక్షకులు ఒకసారి చూసిన జాతకాల సెంటిమెంట్ పాయింట్ ను మళ్ళీ ‘అల వైకుంఠపురములో’ చూస్తారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కథను మ్యాజిక్ చేయడంలో త్రివిక్రమ్ కు ‘వెంకీమామ’ దర్శకుడు బాబి కన్నా మంచి అనుభం ఉంది. దీనితో త్రివిక్రమ్ స్టైల్ మ్యానియా ముందు ఒకే పాయింట్ అయినా ప్రేక్షకులు అంతగా పట్టించుకొకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి మరి ఏమి జరుగుతోందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: