నభా నటేష్ రఫ్ అండ్ టఫ్ యాక్టింగ్ లేటేస్ట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చూపించేసింది. నన్ను దోచుకుందువటే అంటూ క్లాస్ గా వచ్చిన ఈ ముద్దు గుమ్మ మాస్ కిర్రెక్కిపోయేలా ఇస్మార్ట్ అందాలను చూపించింది. ఇక నభా లక్కు నక్కను  తొక్కిందని ఎక్కడికో వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్లుగా నభా దేనికైనా రెడీ అంటూ దూసుకువచ్చేసింది.


అయితే ఇస్మార్ట్ హిట్ తరువాత నభా ఒక్కసారిగా పారితోషికం పెంచేసింది. యాభై లక్షలు సినిమాకు అని డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇస్మార్ట్ తరువాత అనేక చాన్సులు నభా ఇంటి తలుపు తట్టాయి. అయితే ఈ అమ్మడు మాత్రం నో అంటూ ముందు రెమ్యునరేషన్ తేల్చాలంటూ పట్టుపట్టడంతో ఒక్కోటీ జారిపోయాయట.  ఇక నభా ఇంతకు ముందే కమిట్ అయిన రవితేజా మూవీ డిస్కో రాజా మాత్రమే ఉంది.


సినిమా రిలీజ్ కి రెడీగా ఉంటే నభా ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటోంది. ఈ రకమైన పరిస్థితి రావడానికి కారణం నభా వైఖరేనని అంటున్నారు. ఒకటి రెండు హిట్లు పడినంతలోనే డిమాండ్ పెట్టి మరి రేటు పెంచేయడం దారుణమని అంటున్నారు. నభా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజిలో ఫీల్ అవడం వల్ల టాలీవుడ్ పట్టుంచుకోవడం మానేసిందని అంటున్నారు.


ఇదిలా ఉండగా ఇస్మార్ట్ నటించిన మరో హీరోయిన్ నిధి అగర్వాల్ దూసుకుపోతోంది. పట్టూ విడుపులూ చూపిస్తున్న  ఈ అమ్మడికి ఆఫర్లే ఆఫర్లు. దాన్ని చూసైన నభా నేర్చుకోవాలని అంటున్నారు. నభాకు అందం ఉంది. అభినయం కూడా ఉంది. అయినా పట్టు పట్టుకుని కూర్చుంటే మాత్రం చాన్సులు రావు అనేస్తున్నారు. మరి నభా దిగి వస్తుందా. కొత్త మూవీస్ దక్కుతాయా...చూడాలి. ఏది ఏమైనా అమ్మడుకు అన్నీ ఉన్నా అంటూ ఇపుడు టాలీవుడు సణుగుతోందంటేనే అర్ధం చేసుకోవాలి మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: