అందం, అభినయం అన్ని కలగలిసి పుట్టిన అందాల ముద్దుగుమ్మ శ్రుతీహాసన్‌,నటవిశ్వరూపమైన కమల్ హాసన్  కూతురిగా తన నటనతో ఎంతో  పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.ఆమే కేవలం నటనతోనే కాదు తన స్వరంతో ను అభిమానులను మరింతగా ఆకట్టుకుంది .

ఇటీవల డిస్నీ సంస్థ ప్రతినిధులు  అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ళ కథాంశంతో తెరకెక్కిన హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీ ‘ఫ్రోజెన్‌ 2’ ఈ చిత్రం పై పలు విధాలుగా ప్రసంశలు కురించిమా విషయం తెలిసిందే అందుకె  ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు . ‘ఫ్రోజెన్‌ 2’ అనే ఈ  చిత్రానికి హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు  వీరిద్దరూ డబ్బింగ్‌ చెప్పారు.

తెలుగులో నిత్యామీనన్‌ ఈ డబ్బింగ్‌  పనిని పూర్తి చేయగా, తమిళ వెర్షన్‌లో 'ఫ్రోజెన్‌ 2’  ఎల్సా  అనే పాత్ర చాల ముఖ్యమైనది. దీనికి   హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ డబ్బింగ్‌ చెప్పారు.దీనిపై  హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ చేసిన డబ్బింగ్ ఆ పాత్రకి ప్రాణం పోసినట్టుగా ఉంది. అంతేకాదు స్వతహాగానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీహాసన్‌ ‘ఫ్రోజెన్‌ 2’ అనే చిత్రానికి తమిళ వెర్షన్‌ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ–  ‘‘అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎల్సా పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. అన్నా, ఎల్సాల అనుబంధం నన్ను చాల ఆకట్టుకుంది.వారి మధ్య వున్న అనుబంధం లాంటిదే నా చెల్లి అక్షరాహాసన్‌కు, నాకు మధ్య ఉన్న అనుబంధంలా అనిపించింది. ఈ చిత్రం లోని ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్‌ మోడల్‌లా ఉంటుంది’’ అని అన్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఈ ‘ఫ్రోజెన్‌ 2’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: