టివి ఆన్ చేస్తే చాలు బుల్లితెర మీద హంగామా చేసే సుధీర్ రష్మిలు క్రేజీ జంటగా సూపర్ పాపులర్ అయ్యారు. సుధీర్ ఒక షోలో ఉన్నాడు అంటే ఆ షోలో రష్మిక ఉండాల్సిందే అన్నంతగా ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. సుధీర్ పోరాపోవే తప్ప చేసే మిగతా షోలలో రష్మి తప్పకుండా ఉంటుంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ గురించి ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా చూపిస్తుంటారు. 


స్మాల్ స్క్రీన్ పై సక్సెస్ అయితే ఆ గుర్తింపుతో సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు రావడం కామనే. అలానే ఐదేళ్లుగా జబర్దస్త్, ఢీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ హీరోగా మారి సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ధన్య బాలకృష్ణ నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు రష్మినే తీసుకునే ఆలోచన చేశారు మేకర్స్.    


అయితే సుధీర్ సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట రష్మి. డేట్స్ అడ్జెస్ట్ కాక సుధీర్ సినిమా ఆఫర్ ను కాదన్నదట రష్మి. అయితే అసలు కారణం డేట్స్ కాదని.. స్మాల్ స్క్రీన్ పై ఈ జోడీ మీద రకరకాల రూమర్స్ వచ్చాయి. అందుకే ఇక సినిమా కూడా చేస్తే ఇంకా రూమర్స్ ఎక్కువవుతాయన్న ఉద్దేశంతోనే సుధీర్ సినిమాను రష్మి చేయనని చెప్పిందట. 


సాఫ్ట్ వేర్ సుధీర్ లో సుధీర్ తన ప్రతిభ చూపించడానికి ప్రయత్నించాడు. స్మాల్ స్క్రీన్ పై ఉన్న అతని ఇమేజ్ సినిమా సక్సెస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి త్రీ మంకీస్ సినిమా కూడా చేస్తున్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై సెటిల్ అవుదామని మంచి ప్రయత్నమే చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: