మురగదాస్ దర్శకత్వంలో
మహేష్ నటించిన ‘స్పైడర్’ ఘోర పరాజయం చెందినా
మహేష్ ఆ విషయాలను పక్కకు పెట్టి
రజినీకాంత్ మురగదాస్ ల ‘దర్బార్’ మూవీని ప్రమోట్ చేయడం
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా
మహేష్ తనకు భయంకరమైన ఫెయిల్యూర్ లు ఇచ్చిన దర్శకుల వైపు కన్నెత్తి కూడ చూడడు అన్నప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
అయితే ఈ తీరుకు భిన్నంగా
మహేష్ రజినీకాంత్ నటిస్తున్న ‘దర్బార్’
మూవీ పోస్టర్ ను రిలీజ్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. తన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో పోటీగా విడుదల అవుతున్న ‘దర్బార్’
జనవరి 15
సంక్రాంతి రోజున విడుదల కాబోతోంది.
అయితే ఈ పోటీని కూడ లెక్క చేయకుండా
మహేష్ ఇలా మురగదాస్ కోసం ముందుకు రావడం ఇండస్ట్రీలో ఒక మంచి సాంప్రదాయానికి తెర తీసినట్లు అవుతుంది అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నవారు మాత్రం ‘దర్బార్’ రిజల్ట్ బట్టి
మహేష్ మురగదాస్ తో మరొక సినిమాను వచ్చే ఏడాది చేసే ఆలోచనలు చేస్తున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
ఈ విషయాల పై రకరకాల అభిప్రాయాలు ఉన్నా మురగదాస్
మహేష్ ల మధ్య సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోంది అన్న సంకేతాలు ఈ సంఘటన రుజువు చేస్తోంది.
మహేష్ ఎప్పటి నుంచో
కోలీవుడ్ లో తన
మార్కెట్ పెంచుకోవడానికి చాల ఆలోచనలు చేస్తున్నాడు. ‘స్పైడర్’ ప్రమోగం వికటించినా ఇంకా
మహేష్ కు
కోలీవుడ్ మార్కెట్ ఫై మోజు పోలేదు అన్న విషయాన్ని ఈ లేటెస్ట్ సంఘటన రుజువు చేస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాలు పక్కకు పెడితే ప్రస్తుతం
టాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ ను కోల్పోయిన
రజినీకాంత్ కు
మహేష్ ప్రమోషన్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి..