ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ మరోపక్క కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే మద్యపానాన్ని అరికడుతూ పరిపాలనలో సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకు అందించారు ఆ విధంగా అందిస్తూ అద్భుతంగా పరిపాలిస్తున్న జగన్ గురించి చాలామంది ప్రముఖులు కథలు కథలు మాట్లాడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలోనే ఈ విధంగా పరిపాలన అందిస్తే రాజశేఖర్ రెడ్డి పేరు కూడా మర్చిపోతారేమో అంటూ జగన్ పరిపాలన గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి జగన్ పరిపాలన గురించి పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన అద్భుతంగా ఉందని నారాయణమూర్తి అన్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నారాయణమూర్తి ప్రశంసించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సామజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. భారతదేశంలో 54 శాతం జనాభా బీసీలు ఉన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం జగన్ చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టడం అభినందనీయం అని అన్నారు.


రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్ నారాయణ మూర్తికి సన్మానం జరిగింది. ఈ కారక్రమంలో నారాయణ మూర్తి జగన్ ని ప్రశంసించారు. ఈ విధంగానే పరిపాలన ముందుకు తీసుకు వెళ్తే చాలు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే బలమైన ఆర్థిక రాష్ట్రంగా బలమైన కుటుంబ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి.

 



మరింత సమాచారం తెలుసుకోండి: