సింహ, లెజెండ్ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్టు సినిమాలు నందమూరి బాలయ్య కి ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం మూడో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఓకే అయిన నేపథ్యంలో..ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన రూలర్ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి తో చేయబోయే సినిమా ప్రాజెక్టులో పాల్గొనడానికి బాలయ్య బాబు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే రూలర్ సినిమా వచ్చే నెల చివరాఖరిన విడుదల చేయాలని నిర్మాత సి కళ్యాణ్ భావిస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే సంక్రాంతి నుండి బోయపాటితో చేయబోయే సినిమాలో పాల్గొని ఎలాగైనా వచ్చే వేసవికి విడుదల చేయాలని బోయపాటి మరియు బాలకృష్ణ  అనుకుంటున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


ఇదిలా ఉండగా డైరెక్టర్ బోయపాటి గతంలో బాలకృష్ణతో చేసిన రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మొదలుపెట్టే మూడో సినిమాలో కూడా అదే పంథాలో కొనసాగించాలని..గతంలో బాలకృష్ణతో చేసిన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను తీసుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అదే సెంటిమెంట్ కొనసాగించాలని ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని డైరెక్టర్ బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్‌ను దింపుతున్న‌ట్టు తెలుస్తోంది.


రచితా రామ్ కన్నడలో బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆరేడు సినిమాలు చేస్తోంది. గ్లామర్  తారగా అక్కడి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మ‌రి ఇప్పుడు ఆ గ్లామ‌ర్ హీరోయిన్‌ను ఇక్క‌డ బాల‌య్య ప‌క్క‌న పెట్టి బోయ‌పాటి ఎంత వరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు బోయపాటి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్ నీ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ నిజం కాదో..అవునో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: