కోలీవుడ్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ మద్య అపూర్వమైన స్నేహసంబంధాలు ఉన్నాయి.   ఒకప్పుడు తమిళనాట వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేవారు.  ఎన్నో సందర్భాల్లో రజినీకాంత్ తన స్నేహితుడు చాలా అందగాడు..ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని ఖితాబు ఇచ్చారు. ఇక కమల్ హాసన్ పలు సందర్భాల్లో రజినీ స్టైల్ అంటే ఇప్పటికీ పడి చచ్చపోతాను అనేవారు.  అలాంటి వీరిద్దరి మద్య గతంలో ఆదిపత్య పోరు నడిచిందని తెగ రూమర్లు పుట్టుకొచ్చాయి. 

ఇద్దరు హీరోలు స్టార్ డమ్ కోసం పోటీ పడుతున్నారని..ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని గతంలో పలు సందర్భాల్లో సంచలన వార్తలు కూడా వచ్చాయి.  కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ వార్తలు ఖండిస్తూ వచ్చారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు రాజకీయాల్లోకి ఒకేసారి రావడం..ఇక్కడ కూడా విభేదాలు వచ్చాయని ఆ మద్య వార్తలు వచ్చాయి.  కానీ కమల్ హాసన్ ఆరోగ్యకరమైన రాజకీయాలు..ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఎవరు చేసినా మంచిదే అని చెప్పారు.

కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరు ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ వద్ద శిష్యులుగా ఉండేవారు.  ఆయన వీరిద్దరికి ఎన్నో హిట్ సినిమాలు అందించారు..ఒకదశలో కె.బాలచందర్ శిష్యులుగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కమల్ హాసన్, రజినీకాంత్ ఆ తర్వాత సూపర్‌స్టార్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా  కమల్ హాసన్ తన కార్యాలయంలో బాలచందర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమల్, రజినీకాంత్, మణిరత్నంతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. గతంలో ఒకసారి రజినీ నా వద్దకు వచ్చి..తమ మద్య స్టార్ డమ్ కోసం పోటీ నడుస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.. ఇవన్నీ నాకు నచ్చడం లేదు.

నేను సినీ పరిశ్రమకు దూరం కావాలని అనుకుంటున్నాను అని చెప్పారు.  అప్పుడు నాకు ఆయనపై చాలా కోపం వచ్చింది. ప్రేక్షకులకు కేవలం ఎంట్రటైన్ మెంట్ మాత్రమే మనం అందిస్తున్నాం..ఎవరి అభిమానం వారికి ఉంటుంది..అంతే కాని మన మద్య పోటీ ఎప్పటికీ ఉండదని చెప్పాను... మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలని కోరాను. మీరు సాధించాల్సినవి చాలా ఉన్నాయి అని నచ్చచెప్పా. ఐకాన్ అవార్డుకు నిజమైన అర్హత కలిగిన వ్యక్తి రజినీకాంత్` అని కమల్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: