2009 లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు.  ఒకవేళ రాజకీయాల్లో రాణించి ఉంటె మెగాస్టార్ తన 149 సినిమాల దగ్గరే ఆగిపోయేవారు. కానీ, అప్పటి పరిస్థితులు, ప్రభావితం చేసిన రాజకీయ కారణాల వలన మెగాస్టర్ చిరంజీవి దాదాపు ఏడేళ్ల తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.  మెగాస్టర్ కమ్ బ్యాక్ మూవీ సేఫ్ గా ఉండాలని, దాంతో పాటుగా కమర్షియల్ గా హిట్ కావాలని అనుకున్నారు.  


మెగాస్టార్ కోసమే రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేయడం అందులో మెగాస్టార్ 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు.  తమిళంలో సూపర్ హిట్టైన కత్తి సినిమాకు ఇది రీమేక్. మెగాస్టర్ ఖైదీ నెంబర్ 150 భారీ విజయం సాధించింది.  తనలో ఆ పస తగ్గలేదని ఈ సినిమాతో మెగాస్టార్ నిరూపించారు.  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంటను పండించింది.  స్టెప్స్ విషయంలో కూడా  మెగాస్టార్ తిరిగి తన పట్టును సాధించాడు.  


సినిమా తరువాత మెగాస్టార్ 12 ఏళ్ల కల సైరా చేసి మెప్పించాడు.  చిరు 151 కూడా మెగా హిట్ కావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.  మెగాస్టార్ ను మరలా కమర్షియల్ సినిమాలో చూడాలని అనుకున్నారు.  అభిమానులు కోరుకున్నది ఇవ్వడమే ఒక నటుడి లక్ష్యం.  దానికి తగ్గట్టుగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు మెగాస్టార్.  ఈ సినిమా కోసం తన బరువును తగ్గించుకున్నారు.  జిమ్ లో వర్కౌట్ చేశారు.  


ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.  ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నది.  ఇందులో మెగాస్టర్ డబుల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఒకటి మాస్టర్ పాత్ర.  గతంలో మెగాస్టార్ మాస్టర్ సినిమా చేశారు.  అందులో స్టూడెంట్స్ కు చదువు చెప్పే ప్రొఫెసర్ గా కనిపించారు.  ఠాగూర్ సినిమాలో కూడా మెగాస్టార్ ప్రొఫెసర్ గా కనిపించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మరలా ఈ సినిమాలోని ఒక పాత్రలో మాస్టర్ గా కనిపిస్తున్నారని సమాచారం.  అయితే, ఇది నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: