టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ.  ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీతో తన వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు.  ఈ మూవీ తర్వాత వరుసగా నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ తేచ్చుకున్నాయి.  ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ తో దారుణమైన ఫలితాన్ని పొందారు.  ఆ వెంటనే ఏపిలో ఎన్నికలు రావడం..హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలవడం జరిగింది.  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై  సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న మూవీ `రూల‌ర్‌`.


ఆ మద్య రూరల్ కి సంబంధించి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో బాలయ్య కనిపించాడు.  గతంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు మంచి విజయవంతం అయ్యాయి. తాజాగా న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమా ‘రూరల్’ లో రొమాంటిక్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ లుక్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించడమే కాదు..పర్సనాలిటీ కూడా చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది.  తాజాగా బాలయ్య లుక్‌ గత సినిమాలతో పోలిస్తే సరికొత్తగా అనిపించింది. ‘రూలర్‌’ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. గతంలో ‘జైసింహా’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


ప్రస్తుతం కేరళలో బాలకృష్ణ, నటి వేదికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూరుస్తు న్నారు.  ఈ మూవీ డిసెంబరు 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: