ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభమయ్యి చాలా రోజులైంది.  ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ కూడా బయటకు రావడం లేదు. అప్పుడెప్పుడో ఈ మూవీకి సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు తప్పించి మరో ఫోటో పోస్ట్ చేయలేదు.  ఫోటోలు మాత్రమే కాదు, సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా బయటకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఈ అంచనాలను పెంచుతూ సినిమా ప్రారంభం అయ్యింది.  సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకు సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.  ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు.  అంతకు మించి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి విషయం బయటకు రాలేదు.  షూటింగ్ మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. విషయాలు బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠత మొదలైంది.  అన్ని సినిమాలు వాటికీ సంబంధించిన న్యూస్ ను వెల్లడిస్తుంటే.. రాజమౌళి మాత్రం బాహుబలికి సంబంధించిన న్యూస్ ను హైడ్ లో ఉంచారు.  


ఇది అభిమానులను బాగా ఇబ్బంది పెట్టింది.  దీంతో అభిమానులే సొంతంగా పోస్టర్స్ ను తయారు చేసుకొని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.  చాలామంది ఆ పోస్టర్స్ ను చూసి.. అది నిజంగా యూనిట్ రిలీజ్ చేసిన సినిమా పోస్టర్ అనుకోని షాక్ అవుతున్నారు. ఇలా చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు.  ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు.  అభిమానాలు ఇంకెంత కాలం ఎదురు చూడాలో తెలియడం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది.  ఇప్పటికే ఇద్దరు విదేశీ హీరోయిన్లు సినిమా నుంచి తప్పుకున్నారు.  కథ ప్రకారం ఎన్టీఆర్ కు విదేశీ అమ్మాయే కావాలి.  అందుకోసమే విదేశీ హీరోయిన్ కోసం చూస్తున్నారు.  ఎవర్ని సెట్ చేస్తున్నారో ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  బాహుబలిని మించేలా ఉంటుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: