ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ఇప్పుడు అసలేమాత్రం ఫాంలో లేని పూరి. ఎనర్జిటిక్ స్టార్ గా స్క్రీన్ నేమ్ ఉన్నా ఆ రేంజ్ కు తగినట్టుగా హిట్లు అందుకోలేని హీరో రామ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా డైరక్టర్ గా పూరిని.. హీరోగా రామ్ ను మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేలా చేసింది.               


ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ హిట్ అందుకోగా.. వసూళ్ల పరంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇక ఈ సినిమా తర్వాత పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇక ఇస్మార్ట్ హిట్ తర్వాత రామ్ కూడా రెడ్ సినిమా చేస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.        


ఈ సినిమాల తర్వాత మళ్లీ పూరి, రామ్ కలిసి సినిమా చేయబోతున్నారట. రాం రెడ్ పూర్తికాగానే పూరి డైరక్షన్ లో సినిమా ఉంటుందని కన్ఫాం చేశాడు. అయితే అది ఇస్మార్ట్ శంకర్ కు సీక్వలా, ప్రీక్వెలా అన్నది మాత్రం తెలియదని అన్నాడు. డిస్కషన్స్ నడుస్తున్నాయని.. అవి పూర్తయ్యాక అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తామని అన్నాడు రామ్.     


పూరి, రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ బి, సి సెంటర్స్ మెచ్చే సినిమా తీశారు. ఇక ఈ కాంబోలో మరో మూవీ అంటే కచ్చితంగా మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పూరితో రామ్ చేసే రెండో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా ఆకాష్ పూరి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.     



మరింత సమాచారం తెలుసుకోండి: