ఈ మద్య బోల్డ్ కంటెంట్ తో వస్తున్న సినిమాలకు గిరాకీ బాగానే ఉంటుంది.  కొత్త నటులైనా అందులో ఎక్కువ బోల్డ్ కంటేంట్ ఉంటే కొన్ని వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.  ఈ మద్య కలాంలో స్టార్ హీరోల సినిమాల్లో సైతం లిప్ లాక్ సీన్లు ఖచ్చితంగా ఉంటుంది.  ఇక బి గ్రేడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దుల, బెడ్ రూమ్ సీన్లు, బికినీ సీన్లు ఇలా హాట్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తున్నారు. ఇలాంటి సినిమాలు టీజర్, ట్రైలర్ తోనే బాగా హైప్ తెస్తున్నాయి. హాట్ సన్నివేశాలతో టీజర్, ట్రైలర్ కట్ చేస్తున్నారు. దాంతో చాలా మంది ఈ మూవీలో ఇలాంటి రక్తి కట్టించే సన్నివేశాలు బాగానే ఉన్నాయనుకొని థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా  ‘ఏడు చేపల కథ’ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 


గత కొన్ని రోజుల నుంచి  ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. ఈ సినిమాలో నటించిన హీరో, నటీనటులు కానీ.. దర్శకుడు, నిర్మాతలు కానీ.. అసలు ఈ మూవీకి పనిచేసిన వారు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు..పరిచయం కూడా లేదు. కానీ, బోల్డ్ కంటెంట్‌తో, అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను ఆకర్షించారు. టీజర్లు, ట్రైలర్‌తో విపరీతమై బజ్‌ను క్రియేట్ చేశారు. మొత్తానికి ‘ఏ’ సర్టిఫికెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ గురువారం విడుదలైన ఈ ‘ఏడు చేపల కథ’పై ప్రేక్షకులు పెదవి విరిచినా తొలిరోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. దీనికి కారణం మొదటి నుంచి ఈ మూవీపై జనాల్లో ఎంతో క్యూరియాసిటిని పెంచారు. 


తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.1.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.1.13 కోట్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.1.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ బిజినెస్ రూ.1.7 కోట్లుగా ఉంది. ఈమధ్య విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక షేర్ వసూలు చేసిన మూవీ ఇదే. గోపీచంద్ ‘చాణక్య’ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.1 కోట్ల షేర్ రాబట్టింది. కార్తి ‘ఖైదీ’ అయితే రూ. 25 లక్షల షేర్ వసూలు చేసింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఆవిరి’ దారుణంగా రూ.13 లక్షలే రాబట్టింది. ‘ఏడు చేపల కథ’ తొలిరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: