రామ్ చరణ్.. మెగా ప్రొడ్యూసర్ కు లిఫ్టింగ్ ఇవ్వనున్నాడు. తన వల్ల నష్టపోయిన ప్రొడ్యూసర్ కు చెర్రీ మరో రకంగా హెల్ప్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ నష్టాలను పూడ్చేందుకు మెగా తనయుడు ఆ బడా నిర్మాతకు షేరింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. క్రేజీ డైరెక్టర్ తో చేయనున్న ప్రాజెక్ట్ లో పార్టనర్ గా ఛాన్స్ కల్పిస్తున్నాడట. 


మెగా ఫ్యామిలీతో నిర్మాత దానయ్యకు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. చిరంజీవి ప్రోత్సాహంతోనే దానయ్య మెగా నిర్మాతగా డీవీవీ దానయ్య వెలుగులోకి వచ్చాడు. ఆ బాండింగ్ వలనే ఈ నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రొడ్యూసర్ చెర్రీతో చేసిన బ్రూస్లీ వినయ విధేయ రామ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి. దీంతో దానయ్యకు లిఫ్టింగ్ ఇవ్వడానికి చెర్రీ భలే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. 


చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని సైతం దానయ్యనే నిర్మిస్తున్నాడు. అప్పుడెప్పుడో రాజమళి ఈ ప్రొడ్యూసర్ తో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ మాటతోనే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడు. ఈ చిత్రం దానయ్య చేతికి రావడానికి చరణ్ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ లో ఈ ప్రొడ్యూసర్ కు మెగా తనయుడు పార్టనర్ షిప్ ఇప్పిస్తున్నట్టు టాక్. 


ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వినికిడి. చెర్రీతో మాటల మాంత్రికుడు చేయబోయే సినిమాకు దానయ్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. మామూలుగా త్రివిక్రమ్ తన మిత్రుడు రాధాకృష్ణ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ తో తప్పా బయటి బ్యానర్స్ లో సిినిమాలు చేయడు. ఇంకొకరిని పార్టనర్ గా పెట్టుకోడు. కానీ చరణ్ రిక్వెస్ట్ చేయడంతో త్రివిక్రమ్ దానయ్యను పార్టనర్ గా ఒప్పుకున్నట్టు సమాచారం. బ్రూస్ లీ, వినయ విధేయ రామ.. నష్టాలను భర్తీ చేయడానికే చెర్రీప్రొడ్యూసర్ కు ఇలా హెల్పింగ్ చేస్తున్నాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి: