అల్లు అర్జున స్టైలిష్ స్టార్. ఆయన నటించిన సినిమాల్లో ఆ స్టైల్ అలా కనబడుతుంది. ఇక డ్యాన్సుల్లో మెగాస్టార్ కి అచ్చమైన వారసుడు బన్నీయే అంటారు. ఒళ్ళు విరుచుకోవడంలో బన్నీ రెడీ అంటాడు. మూమెంట్ కరెక్ట్ స్టైల్ గా రావడానికి దేనికైనా సిధ్ధపడతాడు. బన్నీ స్పీడ్ అలా ఉంటుంది మరి. ఆయన సాంగ్స్ చూస్తూంటే పక్కన హీరోయిన్ని ఎవరూ చూడరు. అప్పట్లో చిరంజీవిని కూడా ఇలాగే చూశేవారు.


ఇదిలా ఉండగా బన్నీ కొత్త ఏడాదికి అల వైకుంఠ పురంల నుంచి దిగి వచ్చేస్త్న్నాడు. బన్నీ లాస్ట్ సినిమా నా పేరు సూర్య చీదేసింది. దాంతో బన్నీలో కసి పెరిగింది. అది మామూలుగా లేదు. మళ్ళీ ఫోర్ ఫ్రంట్ లో గట్టిగా నిలబడడమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి దబాయించి మరీ బాకీ తీర్చుకోవలనుకుంటున్నాడు. అందుకు అన్ని రకాలుగా రెడీ అయిన స్క్రిప్ట్ తోనే బన్నీ ఈ ఫీట్ చేస్తున్నాడు. త్రివిక్రం శ్రీనివాస్ అంటేనే మాటల మాంత్రికుడు. పైగా సెంటిమెంట్ డైలాగులతో అదరగొడతాడు. మరో వైపు ఎంటర్టైమెంట్ కి లోటు ఉండదు. ఆయన  మూవీలో ప్రతి క్యార్క్టర్ తెర మీద కనబడుతుంది. పండుతుంది కూడా.


ఇక బన్నీ పూజా హెగ్డే ఈ మూవీలో ఫుల్ రొమాంటిక్ గా ఉన్నారు. ఈ జంటతో పాటు మరో అట్రాక్షన్ కూడా ఉంది. అదే టబు. కలయా నిజనా అంటూ అప్పట్లో  కుర్ర కారు కలల్లోనే కాపురం ఉన్న టబు ఈ మూవీకి పెద్ద అసెట్ అంటున్నారు. ఆమెను త్రివిక్రం ఎలా ప్రజెంట్ చేశాడో అన్న ఇంటెరెస్ట్ చాల ఉంది. ఈ మూవీలో సామజవరగమన సాంగ్ లక్షల్లో వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. 


ఆ సాంగ్ కి ప్రరిస్ లో పూజా బన్నీల మధ్య తీస్తున్నారు. ఇక రాములో రాముల సాంగ్ మాస్ కి అపుడే ఎక్కేసింది. ఇలా అనేక రంగులు హంగులు ఉన్న ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. బన్నీ కసి అంతా కలిపి కోట్లు కొల్లగొడుతుందని బన్నీ కెరీర్లో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు. మొత్తానికి బన్నీ ఖాతాలో సూపర్ డూపర్ హిట్ రాసుకోండంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: