టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా విజయంతో  సక్సెస్ దూకుడులో  ఉన్నారు. కాగా సైరా సినిమా విజయం తరువాత కొరటాల శివ డైరెక్షన్లో నటించేందుకు మెగాస్టార్ సిద్ధమయ్యారు. ఈ మూవీలో పాత్ర కోసం చిరంజీవి ఏకంగా  బరువు కూడా తగ్గుతున్నారు . అయితే సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో... అది కూడా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ  మెగాస్టార్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమాపై  ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాగా  చిరంజీవి 152 వ సినిమా కోసం కొరటాల శివ దేవాలయాల  దోపిడి కథాంశాన్ని ఎంచుకున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగానే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు దర్శకుడు కొరటాల శివ



 ఆయన ఏ సినిమా తెరకెక్కించిన అందులో ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తుంటాడు దర్శకుడు కొరటాల. ఇప్పుడు చిరంజీవి కోసం కూడా అలాంటి స్టోరీ యే రెడీ చేసారని  సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ పై తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి.  ఈ సినిమాకి  ఓ టైటిల్ ఖరారైంది అంటూ వస్తున్న వార్తలపై మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. అయితే ఈ సినిమా కథకి సరిపోయేలా గోవిందా హరి గోవిందా అనే టైటిల్ ను చిత్ర బృందం  ఖరారు చేశారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో రెండు దశాబ్దాల కింద  నాగార్జున శ్రీదేవి  సినిమా గోవింద గోవింద ఫ్లాప్ కావడంతో... చిరంజీవి సినిమాకు కూడా ఇలాంటి టైటిల్ ఎంచుకోవడంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. నక్సలైట్ గోవింద గా ఒక పాత్రలో నటిస్తుండగా... ఆచార్య గోవిందగా  మరో పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 



 అయితే మొదట ఈ సినిమా టైటిల్ కోసం గోవింద ఆచార్య అనే పేరును ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా కథకి సరిపోయేలా గోవిందా హరి గోవిందా అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని మరోమారు ఈ సినిమా టైటిల్ పై వార్తలు మొదలయ్యాయి. కాగా  గోవింద గోవింద సెంటిమెంట్ పట్టించుకోకుండా చిరంజీవి గోవిందా హరి గోవిందా అనే టైటిల్ తో కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతం సర్పంచ్ గా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: