సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రనతి బరిలో దిగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 అని ఎనౌన్స్ చేసినా ఒకరోజు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ప్రీ రిలీజ్ హంగమా ఓ రేంజ్ లో ఉండాల్సిందే.


అందుకే సినిమా రిలీజ్ కు ముందే ప్రమోషన్స్ క్రేజీగా ప్లాన్ చేశారట. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ఓ 10 రోజుల్లో రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక దాని తర్వాత డైలాగ్ టీజర్ వస్తుందట. అయితే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ మాత్రం న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


అంతేకాదు ఏపి, తెలంగాణా రాష్ట్రాల్లో మేజర్ సిటీల్లోని థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.


లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ కూడా అన్ని బాగా వస్తున్నాయట. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న మహేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: