వచ్చే రెండు నెలలు టాలీవుడ్ ప్రేక్షకులకు సినీ పండుగ కనువిందు చేయనుంది. మంచి సినిమాలు విడుదల కావడానికి ఎదురుచూస్తున్న సినిమా ప్రేక్షకులకు ఇదొక గుడ్ న్యూస్. కార్తీ నటించిన ఖైదీ సినిమా తరువాత, టాలీవుడ్లో మంచి కలెక్షన్లు పొందిన చిత్రం లేదు,  ఈ నవంబర్ లోను చెప్పుకోదగ్గ మంచి సినిమాలు ఏమీ లేవు. ఈ మధ్యనే విడుదల అయిన ఏడు చేపల కథ మరియు తిప్పరా మీసం సినిమాలు ఆశించిన మేర సక్సెస్ టాక్ తెచ్చుకోలేదు.


సాధారణంగా, సినిమా నిర్మాతలు తమ సినిమాలను నవంబర్‌లో విడుదల చేయడానికి ఆసక్తి చూపరు. సినీ పండుగ డిసెంబర్ 12 న విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామా సినిమా విడుదలతో ప్రారంభం కానుంది. ఇక ఇదే నెలలో డిసెంబర్ 20 న సాయి ధరం తేజ్ యొక్క 'ప్రతిరోజు పండగే' మరియు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'రూలర్' విడుదల కానున్నాయి. ఇది క్రిస్మస్ సెలవు వారాంతం కాబట్టి, నిర్మాతలు తమ పెట్టుబడికి మంచి రాబడిని ఆశిస్తున్నారు. డిసెంబర్ 25 న రాజ్ తరుణ్ యొక్క 'ఇద్దరి లోకం ఒకటే' విడుదల కానుంది. రాజ్ తరుణ్ కు ఈ సినిమా హిట్ చాలా అవసరం ఎందుకంటే రాజ్ తరుణ్ ఇటీవల నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయ్. ఈ సినిమా హిట్ పైనే రాజ్ తరుణ్ సినీ కెరీర్ ఆధారపడి ఉంది.


ఇక జనవరి విషయానికి వస్తే, జనవరి 12 న అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురంలో మరియు మహేష్ బాబు యొక్క సరిలేరు నీకేవ్వరు విడుదల కానున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కానుండడంతో, సినీ అభిమానులు చాలా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. జనవరి 15 న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా, జనవరి 24 న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న  సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా విడుదల కానుంది. జనవరి 25 న, అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం విడుదల కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: