కోట్ల ఆస్థి పాస్తులు ఉంటే చాలు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఈజీగా అయిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ వారసులు, వ్యాపార కుటుంబ వారసులు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది నిలదొక్కుకోలేకపోయారు. నెప్టోయిజం (నటవారసత్వం) రాజ్యమేలే చోట కొత్త హీరో వచ్చి నిలదొక్కుకోవడం అంటే అదో సవాల్ లాంటిది. ప్రతిభతో పాటు ఎన్నో మార్కెట్ క్యాలిక్యులేషన్స్ .. లక్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఎవరు హీరో కావాలి. ఎవరు కాకూడదు అన్నది డిసైడ్ చేస్తుంటాయి. సినీ కుటుంబం అండదండలు ఉన్నా అది అవకాశాలు తేవడం వరకే. ఆ తర్వాత నిరూపించుకుని ఎవరికి వారు ఎదగాలి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎక్కడ చూసినా ఈ సన్నివేశం ఉంది. 


అయితే ఇప్పుడు రాజకీయ .. సినీ నేపధ్యం ఉన్న గల్లా వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఎందరో కార్పొరెట్ గురూలు.. కార్పొరెట్ కంపెనీల ఓనర్ల పుత్ర రత్నాలు ఇక్కడ హీరోలుగా ట్రై చేసి ఫెయిలైన సందర్భాలున్నాయి. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు. తాజాగా సినీ నేపథ్యం కార్పొరెట్ కంపెనీల నేపథ్యం ఉన్న అశోక్ గల్లా ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ కి అశోక్ మేనల్లుడు. ఆయన అక్కా బావలైన గల్లా పద్మ- జయదేవ్ దంపతుల వారసుడు అశోక్ గల్లా. అతడి డెబ్యూ సినిమాని తల్లిదండ్రులే నిర్మిస్తున్నారు. తాజాగా డెబ్యూ హీరో ఫోటోతో పాటు రిలీజ్ చేసిన ఆహ్వాన పత్రికలో ఓ ప్రముఖ కార్పొరెట్ బ్రాండ్ లోగో డిజైన్ గా కనిపించింది. డెబ్యూ హీరో అశోక్  ఆహ్వాన పత్రికలో అమర్ రాజా గ్రూప్ లోగో కనిపించింది.


అయితే అమర్ రాజా కంపెనీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్యాలు నిర్వహిస్తోంది. అమర్ రాజా బ్యాటరీస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బ్రాండ్. ఆసియాలోనే బిలియన్ డాలర్ బిజినెస్ చేసే బెస్ట్ కంపెనీల జాబితాలో నిలిచింది. ఫోర్బ్స్ జాబితాలోనూ అమర్ రాజా గ్రూప్ టాప్ పొజిషన్ లో నిలిచింది. ఒక బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఆస్తులు అమర్ రాజా గ్రూప్ సొంతం. మరీ చూడాలి గల్లా వారసుడు నిలదొక్కుకోగలడో లేదో !

మరింత సమాచారం తెలుసుకోండి: