5.55
1.  2019 సంక్రాంతి నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో రిలీజైన ప్రతి సినిమా డిజిటల్లో అందుబాటు లో ఉన్నాయి. ఏ సినిమా రిలీజైనా నాలుగైదు వారాల్లోనే ఆన్ లైన్ స్ట్రీమింగు కి అందుబాటు లోకి వచ్చేస్తుండడం తో తమకు నచ్చిన సినిమాలని మొబైల్ లో చూసి ఎంజాయ్ చేయడానికి జనాలు ఇంట్రస్ట్ గా ఉంటున్నారు. ఇలా రిలీజైన సినిమాని అలా డిజిటల్ లో చూసే ఛాన్స్ ఉంటుంది. సినీ ప్రేమికులందరు డిజిటల్ వైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో థియేటర్ల కు వచ్చేవారి సంఖ్య అంతే దారుణంగా పడిపోయిందని ప్రత్యక్షంగా కనబడుతుంది. 
తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాఅసురన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ప్రస్తుతం ఉంది. రీసెంట్‌గా ఈ సినిమా ట్రెండింగ్ అవడంతో అందరూ ఆన్ లైన్ లో ప్రత్యేకించి చూస్తున్నారు. అయితే ఈ పరిస్థితి చూస్తుంటే అసురన్ తెలుగు రీమేక్ పై బాగా ఎఫెక్ట్ అవబోతోందని  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అసురన్ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న అగ్రనిర్మాత డి.సురేష్ బాబు ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్టును రూపొందించే పనిలో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. రీమేక్ చేసే సత్తా ఉన్న దర్శకుడి కోసం చూస్తున్నారు. అయితే ఈలోగానే ఆన్ లైన్ లో అసురన్ రిలీజై పోవడంతో తెలుగు ప్రేక్షకులు అక్కడ చూసేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ ప్రభావం తెలుగు రీమేక్  పై ఉంటుందా ఉండదా? అంటూ కొత్తగా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.
డిజిటల్ ని ఎంకరేజ్ చేసేది టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలే కాబట్టి ఇతర కోణాల్లో విశ్లేషిస్తే దీనివల్ల పెద్ద పంచ్ పడుతోంది. మరి అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు కాబట్టి ఆయన ఏ కోణంలో విశ్లేషిస్తారు? అన్నది చూడాలి. ఇక వెంకీతో అసురన్ రీమేక్ సేఫా కాదా అన్నది కూడా ఆయనే స్వయంగా విశ్లేషిస్తే బావుంటుందేమో! అయితే రీమేక్ కాబట్టి ఎట్టి పరిస్థుతుల్లోను మక్కీకి మక్కీ మాత్రం దించరు. మన తెలుగు నేటివిటీకి..వెంకీ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. అదే రీమేక్ సినిమా మీద మనవాళ్ళకున్న నమ్మకమని అర్థమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: