‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు తన అభిమానులను కాలర్ ఎగరేసేలా సినిమాలు తీస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.


విషయంలోకి వెళితే  తాజాగా ఇటీవల ట్విట్టర్ లో లక్ష ట్వీట్లు చేసి సరిలేరు నీకెవ్వరు హ్యాష్ ట్యాగ్ ను భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు.అంతేకాకుండా మరో ట్యాగ్ పెట్టి దానికంటూ ఒక స్పెషల్ కామన్ డీపీ తయారు చేసుకొని దానితో కూడా రచ్చ లేపేస్తున్నారు. గతంలో ఈ విధంగానే మహేష్ పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన మహేష్ అభిమానులు తాజాగా సినిమా పోస్టర్ రిలీజ్ అయిన సందర్భంలో కూడా మరి అదే విధంగా టైటిల్ విడుదలైన సందర్భంలో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ అయ్యేలా వ్యవహరించిన మహేష్ అభిమానులు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం కూడా అదే స్థాయిలో రచ్చ రచ్చ చేస్తున్నారు.


మరోపక్క ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన విజయశాంతి పోస్టర్ మరియు మహేష్ పోస్టర్ దీపావళి పండుగ నాడు విడుదల చేసి అభిమానులను ఎంతగానో అలరించిన సినిమా యూనిట్. నవంబర్ 4వ వారం నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అదిరిపోయే స్టైల్ లో చేయడానికి కొత్త ప్లాన్ వేసినట్లు సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించిన కొత్త కొత్త న్యూస్ రోజుకొకటి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: