సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపార రంగంలో మరియు వాణిజ్య రంగంలో రాణిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు మరియు అదే విధంగా సొంత నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాణ రంగంలో అడుగుపెట్టి కొణిదెల ప్రొడక్షన్స్ అనే సంస్థ నిర్మించి తండ్రి చిరంజీవి సినిమాలను నిర్మిస్తూ వ్యాపారంలో బిజీ బిజీగా ఉంటూ మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నారు.


తాజాగా ఇప్పుడు ఇదే బాటలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారంలో కూడా రాణించాలని ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సొంత నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' అనే నిర్మాణ సంస్థ ఉంది. దీని బాధ్యతలు కళ్యాణ్ రామ్ చూసుకుంటున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓ బ్యానర్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. మహేష్ బాబులానే తన సినిమాల నిర్మాణంలో పాలు పంచుకునే దిశగా ఎన్టీఆర్ అడుగులు వేయబోతున్నట్లు సమాచారం.


మంచి రోజు చూసుకొని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందో తెలియాలంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే సౌత్ ఇండియాలో సూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: