ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరక్కుతున్న భారీ బడ్జెట్ మల్టి స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబడుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రస్తుతం హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలలకు ముందు జరిగిన అఫీషియల్ ప్రెస్ మీట్ తరువాత ఒక్క న్యూస్ కూడా అఫీషియల్ గా బయటకు రాలేదు. 

అలానే ఆ సమయంలో ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి ఉన్న క్లోజప్ ఫోటో ఒకటి మాత్రమే రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క పిక్ కూడా రిలీజ్ కాకపోవడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. అయితే నేడు ఈ సినిమాలోని హీరోలైన చరణ్, ఎన్టీఆర్ ల అఫీషియల్ లుక్స్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఎవరు లీక్ చేసారు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక కాసేపటి క్రితం ఇవి బయటకు రాగానే, వెంటనే ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఆ విషయం చేరడంతో వాటిని డిలీట్ చేయించారట. 

కాగా వారిద్దరికి సంబందించిన రెండు పిక్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో నేడు చక్కర్లు కొడుతుండడంతో, అవి ఆర్ఆర్ఆర్ లోని హీరోల ఫోటోలు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, వందలాది మంది కష్టపడి తీసే సినిమాకి సంబందించిన ముఖ్యమైన ఫోటోలను ఈ విధంగా తప్పుడు పద్ధతుల్లో లీక్ చేయడం సరైనది కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: