వాస్తవానికి మన భారతదేశంలోని సినిమా ప్రేక్షకులందరిలోకి సౌత్ సినిమా ప్రేక్షకులు మరియు హీరో, హీరోయిన్ల అభిమానులు ఒకింత ప్రత్యేకమని, ఎందుకంటే వారు ఎవరినైనా అభిమానిస్తే మాత్రం ప్రాణంకంటే మిన్నగా ఆరాధిస్తారని ఎందరో ప్రముఖులు చెప్పడం జరిగింది. అంటే మన ప్రేక్షకులకు సినిమా నటులు అంటే అంత వల్లమాలిన అభిమానం అన్నమాట. అయితే ఇటువంటివి ఒక పరిధి మేరకు బాగానే ఉంటాయి, కానీ అభిమానం ఒక్కోసారి పెడదారి పడితే మాత్రం, దానిని ఎంతటివారు అయినా సరే సహించరు అనేది మనం ప్రతిఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, నేడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్స్ లో ఒకరైన నివేత థామస్, తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ ద్వారా ఫ్యాన్స్ తో కాసేపు సరదాగా లైవ్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. 

ఇక నివేత లైవ్ విషయం తెలుసుకున్న ఎందరో ప్రేక్షకులు, మరియు ఫ్యాన్స్ ఆమెకు తమ తమ ప్రశ్నలను సంధించారు. అయితే ఓపిగ్గా ఎంతో మంది ప్రేక్షకుల ప్రశ్నలకు నివేత సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో కొందరు మాత్రం ఆమెను ఎంతో అసహ్యంగా, జుగుప్సాకరమైన ప్రశ్నలు కూడా అడిగారు. ఇక లైవ్ ముగించిన అనంతరం నివేత, తన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెపుతూ, ఇంతవరకు నాతో ఎంతో ఆనందంగా చాట్ చేసి, మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు అందరికి ఎంతో ధన్యవాదాలు, కానీ మధ్యలో కొందరు ఎంతో అసహ్యంగా ప్రశ్నించడం మాత్రం తనను ఎంతో బాధించిందని, 

నేను కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళ మాదిరి అమ్మాయినే, అన్నిటికంటే ముఖ్యంగా మీలానే ఒక మనిషిని, దయచేసి ఇకపై ఈ విధంగా ప్రవర్తించి, ఇటువంటి ప్రశ్నలు వేయకండి అంటూ ఆమె పోస్ట్ చేయడం జరిగింది. కాగా దీనిపై సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, హీరోయిన్స్ అంటే తప్పుడు మనుషులు అనే భావన ముందుగా కొందరు ప్రేక్షకుల మనసులోనుండి పోవాలని, వాళ్ళు కూడా మన వలె కుటుంబాలు ఉన్నవారే, వారికి కూడా ప్రత్యేకంగా జీవితం అనేది ఉంటుందని, కాబట్టి దయచేసి ఆ విధంగా తప్పుగా వారిని నిందిస్తూ ప్రశ్నలు వేయడం సరైనది కాదని హితవు పలుకుతున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: