దక్షిణాది సినిమా భాషకు చెందిన దర్శకుల్లో మణిరత్నం శైలి విభిన్నం. తమిళ సినిమా పరిశ్రమపైనే కాకుండా యావత్ భారతీయ సినిమాపైనే ఆయన వేసిన ముద్ర మామూలు విషయంల కాదు. ఏ సినిమాలో అయినా ఓ సీన్ కానీ, పాట కానీ, టేకింగ్ కానీ బాగుంటే ఎవరి మదిలోనైనా ‘మణిరత్నం స్టైల్లో ఉందిగా.. తీశాడుగా’ అనే ఆలోచన వస్తుంది. వరుస ఫ్లాపులు వచ్చినా మణిరత్నంతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు నిర్మాతలు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే సినిమా రాబోతోంది.

 


భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను మణిరత్నం తన విభిన్న శైలితో తెరకెక్కించనున్నాడు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, మోహన్ బాబు.. వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించబోతున్నారు. చోళ రాజుల చరిత్రలో ఓ రాజుకు సంబంధించిన కథతో ఈ సినిమాను తీయబోతున్నాడు మణిరత్నం. సినిమాలో నటీనటల వేష, భాషలన్నీ కూడా ఆ కాలంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మణిరత్నం. ఈ కథపై మణి ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాడని సమాచారం. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాను సింగిల్ పార్ట్ లో చెప్పలేమని గ్రహించిన మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఆసక్తికరమైన కథ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట మణిరత్నం.

 


తెలుగులో బాహుబలి ప్రాజెక్టును కూడా రెండు భాగాలుగా తెరకెక్కించి విజయం సాధించిన విధంగా పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మణిరత్నం. బాహుబలి ఇటువంటి కథలకు ఓ దారి వేసినట్టైంది. రెండు భాగాలతో తీయడం వల్ల కథను మరింత వివరంగా చెప్పడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. మణి కూడా ఇటువంటి చారిత్రక గాథలను చెప్పాలంటే రెండు భాగాలు తప్పనిసరని ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనేది మణిరత్నం ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: