పూజితా పొన్నాడా.. షార్ట్ ఫిలిమ్స్ తో టాలెంట్ చూపించి సిల్వర్ స్క్రీన్ పై ఛాన్స్ అందుకున్న ఈ తెలుగు అమ్మాయి తన లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా కనిపించిన పూజితా ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. అందం అభినం రెండు ఉన్నా సరే అమ్మడికి సరైన హిట్టు పడట్లేదు.    


ఏవో చిన్న సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న పూజితా తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక హీరోయిన్స్ సినిమాలతో పాటుగా తరచు చేసే ఫోటో షూట్స్ గురించి తెలిసిందే. పూజిత పొన్నాడ కూడా ఫోటో షూట్స్ చేస్తూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తుంది.


ఫోటో షూట్స్ లో టాప్ లేచిపోయేలా తన లుక్స్ తో ఇంప్రెస్ చేస్తున్న పూజితా సినిమా అవకాశాల్లో మాత్రం ఆ జోష్ కనబరచడం లేదు. చేస్తే చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది లేదంటే సినిమాల్లో చిన్న చిన్న వేశాలతో సరిపెట్టుకుంది. సోలో సినిమా వచ్చి గట్టి హిట్టు కొడితే కాని అమ్మడి టాలెంట్ ఏంటో అందరికి అర్ధం కాదు. అయితే సినిమాలు లేకున్నా అమ్మడు చేసే ఫోటో షూట్స్.. ఇన్ స్టాగ్రాం లో పెట్టే ఫోటోలకు మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


వారానికి ఒకసారి తన స్పెషల్ అండ్ క్రేజీ లుక్స్ తో ఆకట్టుకుంటున్న పూజితా పొన్నాడా.. తనని చూసి తీన్ మార్ సినిమాలో రెహమాన్ రాసిన వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి.. గుండెల్లోనే చేరావే గంటె కొట్టి అన్న పాట హృదయంలో ధ్వనిస్తుందని చెప్పొచ్చు. తనదైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న పూజితాకు అలాంటి అవకాశం వచ్చి ప్రేక్షకులను మెప్పించేలా చేయాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: