‘బాహుబలి’ ‘సాహో’ లతో ప్రభాస్ ‘సైరా’ తో చిరంజీవి నేషనల్ సెలెబ్రెటీలుగా మారిన నేపధ్యంలో వారి అడుగు జాడలను అనుసరిస్తూ అల్లు అర్జున్ కూడ నేషనల్ సెలెబ్రెటీగా మారాలని చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. త్వరలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్న మూవీని ‘పాన్ ఇండియా’ మూవీగా జాతీయ స్థాయిలో అన్ని ప్రముఖ భాషలలోను విడుదల చేయడానికి బన్నీ సుకుమార్లు వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.

మూవీ కథ గంధపు చెక్కల  స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతూ ఈ మూవీ చిత్రీకరణ అంతా దట్టమైన నల్లమల ఫారెస్ట్ లో తీయబోతున్న పరిస్థితులలో ఈ మూవీ కథకు జాతీయ స్థాయిలో ఆధరణ లభిస్తుందని బన్నీ భావిస్తున్నాడు. దీనితో ఈ సినిమాను తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషలతో పాటు బెంగాలిలో కూడ విడుదల చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. 

ఈ వ్యూహాలకు అనుగుణంగా ఈ మూవీకి సంబంధించిన వివిధ భాషల డైలాగ్ వెర్షన్ లు రాయించే పనిలో సుకుమార్ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ సమయంలో కొన్నికొన్ని సీన్స్ ను మల్టిపుల్ టెక్స్ గా షూట్ చేసి ఈ మూవీని ఆయా భాషల ప్రేక్షకుల నేటివిటికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించేందుకు చాల లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి పాత్రను బన్నీ పాత్రతో సమానంగా మాత్రమే కాకుండా కొన్నికొన్ని సీన్స్ లో బన్నీని డామినేట్ చేసే విధంగా సుకుమార్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ కు మళయాళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ను బన్నీ ఇప్పటి వరకు పూర్తిగా ఉపయోగించలేకపోయాడు. దీనితో ఆలోటును పూడ్చే విధంగా బన్నీని నేషనల్ స్టార్ గా మార్చడానికి సుకుమార్ మూవీ ఒక గట్టి ప్రయత్నం చేయబోతోంది అన్న లీకులు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: