ఇప్పటివరకు తెలుగులో ఇద్దరే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కు మంచి క్రేజ్ ఉండేది. వారే దేవి శ్రీ ప్రసాద్ ఇంకొకరు తమన్. అయితే ఇప్పుడు మన తెలుగు మేకర్స్ బాలీవుడ్ మ్యూజిక్ దర్శకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. లేటెస్ట్ గా 'సాహో' ' సైరా' లాంటి బడా సినిమాలకు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ నే నమ్ముకున్నారు. అయితే 'సాహో' కి సంబంధించి శంకర్ ఎసన్ లాయ్ మధ్యలోనే సినిమాను వదిలేసి మేకర్స్ కి షాక్ ఇచ్చారు. అయితే అమిత్ త్రివేది మాత్రం 'సైరా' పూర్తయ్యే వరకూ పని చేసాడు. నిజానికి 'సైరా' విషయంలో నేపథ్య సంగీతం పై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమాలో ఉన్న అడపాదడపా ఎలివేట్ అయిన సన్నివేశాలకు అమిత్ నుండి అదిరిపోయే నేపథ్య సంగీతం పడలేదంటూ మెగా ఫ్యాన్స్ కూడా చెప్పుకున్నారు.


తెర మీద సైరా లో ఎన్నో మంచి సన్నివేశాలు వచ్చినా పెద్దగా ఎలివేట్ కాలేదని దానికి కారణం నేపధ్య సంగీతమే కారణమని మెగా ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇక పాటల్లో కూడా టైటిల్ సాంగ్ ఒక్కటే క్లిక్ అయింది. సినిమా ప్రారంభంలో వచ్చే జాతర సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయితే ఇప్పుడు 'సైరా' మ్యూజిక్ ఎఫెక్ట్ ప్రభాస్ 'జాన్' మీద పడింది. దీనికి కారణం ఈ సినిమాకు కూడా అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండటం. అయితే మెగా స్టార్ సినిమాకు మంచి నేపథ్య సంగీత ఇవ్వలేకపోయిన అమిత్ కనీసం ప్రభాస్ సినిమాకైనా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడా అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా వస్తే అంత మంచిగా ఎమోషన్ సీన్స్ గాని హీరోయిజం సీన్స్ బాగా వస్తాయి. రాజమౌళి సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్ధం అవుతుంది. సాధారణ సీన్ కూడా నేపధ్య సంగీతంతో ఇక్కడికో వెళుతుంది.  అసలే ప్రభాస్ జాన్ పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది. మరి ఆ లవ్ ఫీల్ క్యారీ చేసేలా మ్యూజిక్ పడాలి ముఖ్యంగా పాటలు మెస్మరైజ్ చేయాలి. అప్పుడే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మరి ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఈసారైనా తన మ్యూజిక్ తో సత్తా చాటతాడా ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: