ఈ మధ్యకాలంలో నటీ నటుల్లో చాల మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే తమ బెడ్‌రూం విషయాలు కూడా చాల ఒపెన్‌గా మాట్లాడుతున్నారు. ఇలా ఇప్పటివరకు నటీమణులు తమ పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకోవడంలో ముందున్నారు. అంతే కాకుండా పూర్తి  ప్రైవేటు కార్యక్రమం గా ఫీలయ్యే సెక్స్ లైఫ్ గురించి ఓపెన్ గా చెప్పటం ఈ మధ్య చాలా మంది ప్రముఖులు చేస్తున్నదే. తాజాగా అమెరికన్ నటి అప్లే గ్రహం తన సెక్స్ జీవితం గురించి ఆశ్చర్య పోయేలా వ్యాఖ్యలు చేశారు.


ఇండో కెనడియన్ యూ ట్యూబర్ లిల్లీ సింగ్ హోస్ట్ చేస్తున్న ఎ లిటిల్ లేట్ విత్ లిల్లీ సింగ్ షోలో పాల్గొన్న నటి అప్లే గ్రహం శృంగారం విషయంలో ఓపెన్ గా మాట్లాడారు. ఈ షోలో అన్ని విషయాల మీద మొహమాటం లేకుండా మాట్లాడేసిన ఆమె.. తాను.. తన భర్త ఇద్దరికి ప్రార్థనల మీద ఎంతో నమ్మకం ఉందని అయితే. తామిద్దరం ప్రార్థనా సమయాల్లో తప్పక చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకోని అవి పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి సెక్స్ లో పాల్గొంటానని చెప్పింది.


అంతేకాకుండా తాను చేసే దేమీ తప్పు కాదని.. ఎందుకంటే ప్రార్థనలు మానసిక ప్రశాంతతను ఇస్తే, సెక్స్ అనేది శారీరక ప్రశాంతత ఇస్తుందన్నారు. ఈ విషయంలో తామిద్దరి మధ్య సెక్స్ జీవితాని కి సంబంధించి మంచి బాండింగ్ ఉందని చెప్పారు ఈ నటి ఈ మాట వినగానే లిల్లీ సింగ్ షాకైంది. ‘అయితే నేను కూడా ఓ రాత్రి ప్రార్థన చేయాలన్న మాట’ అని వెటకారంగా కామెంట్ చేసింది...


ఇకపోతే నిర్మోహమాటంగా చెప్పిన అప్లే గ్రహం మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బెడ్రూం విషయాలు ఎంత బోల్డ్ గా చెబుతుందో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇకపోతే ఇలాంటి విషయంలో కొన్ని రోజుల క్రితం ప్రముఖ అమెరికన్ సింగర్ కాన్యే వెస్ట్ కూడా సెక్స్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: