ప్రస్తుతం ప్రభాస్ తన కొత్త సినిమా జాన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేదిని తీసుకున్నారు. ఇటివల విడుదలైన మెగాస్టార్ సంచలనం సైరాకు అమిత్ అద్భుతమైన బాణీలు అందించాడు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ధియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. సైరాకు అమిత్ చేసిన వర్క్ నచ్చే ప్రభాస్బాలీవుడ్ సెన్షేషన్ మ్యూజిక్ డైరక్టర్ ను సజెస్ట్ చేశాడని అంటున్నారు.

 


ప్రభాస్ సినిమా ఇప్పుడు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా విడుదల అవుతున్నాయి. ప్రభాస్ నటించిన సాహోకు కూడా తమిళ మ్యూజిక్ డైరక్టర్ గిబ్రాన్ నే తీసుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టే కథ, కథనాలు, టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనివల్ల ఖర్చు ఎక్కువైనా వెనుకడుగు వేయటం లేదు. ఎలాగూ బలీవుడ్ మార్కెట్ ఉండనే ఉంది కాబట్టి ధైర్యం చేస్తున్నాడు. ఇందుకు ఉదాహరణగా సాహోను చెప్పుకోవచ్చు.

 


సాహో అన్ని బాషల్లో ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో 150 కోట్లు వరకూ కలెక్ట్ చేయడం విశేషం. దీంతో సినిమా లావిష్ గా ఉండడమే కాదు, అన్ని విభాగాల్లోనూ సినిమా లావిష్ గా రావాలని ప్రయత్నిస్తున్నాడు. సాహోలో కథ కంటే స్క్రీన్ ప్రెసన్సే ఎక్కువగా కనబడుతుంది. దుబాయ్ లో చేసిన యాక్షన్ సీన్లే గుర్తొస్తాయి. జిబ్రాన్ అందించిన పాటలు కూడా విదేశీ లొకేషన్లలో భారీగా తెరకెక్కించారు. దీంతో రెగ్యులర్ గా పెట్టే ఖర్చు కంటే అన్ని భాషల సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయాల్సి వస్తోంది. అందుకే ఖర్చుకు వెనుకాడడం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: