బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ అంతకు మించి ఘన విజయాన్ని అందుకోవాలని ‘సాహో’ ద్వారా గట్టి ప్రయత్నాలు చేసాడు. వాస్తవానికి ‘సాహో’ ఫ్లాప్ అయినప్పటికీ ఆ మూవీని బాలీవుడ్ ప్రేక్షకులు బాగానే చూసారు. దీనితో బాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ మ్యానియా కొనసాగుతోంది అన్న కామెంట్స్ వచ్చాయి. 

దీనికితోడు ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత కూడ ప్రభాస్ కు బాలీవుడ్ నుండి అనేక ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రభాస్ ఈ విషయాలను పట్టించుకోకుండా తన లేటెస్ట్ మూవీ ‘జాన్’ ను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయాలని ఈ మూవీని హిందీలో డబ్ చేసి విడుదల చేయవద్దనీ స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే ఈ మూవీ దర్శకుడు జిల్ రాథాకృష్ణకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ కారణాల రీత్యా ఈ మూవీ బడ్జెట్ ను తగ్గించివేసి యూరప్ లో తీయవలసిన షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో తీసే విధంగా మార్పులు చేసారు అని తెలుస్తోంది. ‘సాహో’ కు బాలీవుడ్ మార్కెట్ లో మిశ్రమ స్పందన రావడంతో మళ్ళీ అలాంటి ప్రయోగం ఇప్పట్లో చేసే ఉద్దేశ్యం ప్రభాస్ కు లేదు అని అంటున్నారు. 

టాలీవుడ్ టాప్ హీరోల రేస్ లో పోటీ విపరీతంగా కొనసాగుతున్న పరిస్థితులలో బాలీవుడ్ పై విపరీతమైన ఆశలు పెట్టుకుని తనకు యంగ్ రెబల్ స్టార్ హోదా ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ పై శ్రద్ధ పెట్టక పోతే అసలకు మోసం వస్తుంది అన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ హిందీ వెర్షన్ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్. దీనితో ఒక్క ‘సాహో’ ఫలితం ప్రభాస్ నిర్ణయాలను మాత్రమే కాకుండా అతడి వ్యక్తిత్వాన్ని కూడ పూర్తిగా మార్చింది అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: