అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా వ్యాపార వేత్తగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అల్లు అరవింద్ నిమ్మగడ్డ ప్రసాద్ మేఘా కృష్ణారెడ్డి మైహోమ్ రామేశ్వర రావులు కలిసి 10 వేల కోట్ల పెట్టుబడితో అమెజాన్ హాట్ స్టార్ నెట్ ఫ్లిక్స్ లకు చెక్ పెట్టడానికి పదివేల కోట్ల భారీ పెట్టుబడితో వేసిన స్కెచ్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఒక కొత్త కంపెనీగా అరవింద్ వీరందరితో కలిసి త్వరలో ప్రారంభించబోతున్న ‘OTT’ సర్వీస్ డిజిటల్ మీడియా సంస్థ రానున్న రోజులలో దక్షిణ భారత సినిమా రంగాన్ని షేక్ చేయబోతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లు చేస్తున్న వ్యాపారానికి గండి కొట్టే విధంగా అరవింద్ కొత్త వ్యాపార సంస్థ మారబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

స్ట్రీమింగ్ సర్వీస్ గా ఏర్పాటు చేయబడుతున్న ఈ వ్యాపార సంస్థ కార్యకలాపాల కోసం జూబ్లీహిల్స్ లోని ఈ సంస్థ కార్యాలయం ఇప్పటికే ఏర్పాటు చేయబడటమే కాకుండా ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న అజిత్ టాకూర్ ను సిఇవో గా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిజిటల్ ఛానల్ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు.

ప్రస్థుతం సినిమాల కలక్షన్స్ ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీసుల వల్ల పడిపోతున్నాయి అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఆ విమర్శలు లెక్కచేయకుండా ఇప్పుడు అరవింద్ అదే వ్యాపారంలోకి అడుగు పెట్టడం అత్యంత షాకింగ్ గా మారింది. వాస్తవానికి అరవింద్ కు దక్షిణ భారత సినిమా రంగంతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కొత్త వ్యాపార సంస్థ బాగా రాణించే ఆస్కారం ఉంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: