అక్కినేని మెగా ఫ్యామిలీ హీరోలులా నందమూరి ఫ్యామిలీ హీరోలు బిజినెస్ పరంగా పెద్దగా రాణించలేదు. దీనికితోడు సీనియర్ ఎన్టీఆర్ నుండి బాలకృష్ణ వరకు నిర్మాతగా చేసిన ప్రయత్నాలకు భారీ గా నష్టాలు వచ్చాయి. అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడ నిర్మాతగా సినిమాలు తీసి బాగా నష్టపోయాడు అన్న వార్తలు ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఒక సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటమే కాకుండా దీనికి సంబంధించి తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నాడు అని వస్తున్న వార్తలు షాకింగ్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని భారీగా లాభాలు గణిస్తున్న ప్రభాస్ చరణ్ మహేష్ ల పద్ధతిలో జూనియర్ కూడ ఒక సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు తీసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు టాక్.

వాస్తవానికి సొంత నిర్మాణ సంస్థలు మిగతా టాప్ హీరోలకు కలిసి వచ్చినంతగా నందమూరి హీరోలకు ఏమాత్రం కలిసిరాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా బాలకృష్ణకు కోట్ల రూపాయలలో నష్టం వచ్చింది అన్న వార్తలు కూడ ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో జూనియర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందికి షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి అధికారిక సమాచారం లేకపోయినా జూనియర్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలను వింటున్న జూనియర్ ఆ కథలో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసి తన సొంత బ్యానర్ పై నిర్మించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత ఈ విషయమై జూనియర్ ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. దీనితో జూనియర్ నందమూరి ఫ్యామిలీ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: