భారతీయ సినిమాల్లో సంగీతానికి, పాటలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు సినిమాల్లో తెలుగు సంగీత దర్శకులతో పాటు పరభాషా సంగీత దర్శకులు అనేక మంది పని చేస్తారు. మన తెలుగు సంగీత దర్శకులు పరభాషా సినిమాలకు సంగీతం అందించడం తక్కువే. తక్కువ అనడం కంటే ఆయా భాషల దర్శక నిర్మాతలు ఎవరూ మనవాళ్లని తీసుకోరు అనటం సముచితం. తెలుగు అగ్ర హీరోలు సైతం ఇతర భాషల నుంచి మ్యూజిక్ డైరక్టర్లనే తీసుకుంటున్నారు.

 


తెలుగు సంగీత దర్శకులను మనవాళ్లే నమ్మటం లేదని అర్ధమవుతోంది. చిరంజీవి సైరాకు అమిత్ త్రివేది, 152కు అతుల్-అజయ్ ను తీసుకున్నాడు. గౌతమీ.. జైసింహ, రూలర్ కు చిరంతన్ భట్ తోనే సంగీతం చేయించాడు బాలకృష్ణ. ప్రభాస్ సాహోకు గిబ్రాన్, జాన్ కు అమిత్ ను తీసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు అందించిన మణిశర్మను అగ్ర హీరోలు తీసుకోవటం లేదు. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రొటీన్ అయిపోయి రెగ్యులర్ గా ఒకే ట్యూన్స్ ఇస్తున్నాడన్న ముద్ర పడిపోయింది. ఇటివల మహేశ్ సినిమాలకు ఇచ్చిన పాటలు వింటే ఏ పాట ఏ సినిమాలోనిదో కనుక్కోవటం కష్టం.

 

 

కీరవాణి రాజమౌళి సినిమాలకే ఫిక్స్ అయిపోయాడు. మిక్కీ జే మేయర్ మంచి మ్యూజిక్ ఇస్తున్నా పట్టించుకోవటం లేదు. వివేక్ సాగర్, చేతన్ భరద్వాజ్ లాంటి యూత్ ను ఎంకరేజ్ చేయట్లేదు. తమన్ తెలుగు సంగీత దర్శకుడిగా మారిపోయాడు. ఇతర భాషల వాళ్లు తెలుగు సంగీత దర్శకుల వైపు చూడకపోవడం.. వాళ్ల గొప్పదనం అనుకోవాలా.. మన చేతకానితనం అనుకోవాలో అర్ధం కాని పరిస్థితి. తెలుగు సినిమాలకు బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి తీసుకుంటూ.. తెలుగు సత్తా ఇంతేనా అని అనుకునే అవకాశం మనమే ఇస్తున్నట్టు లెక్క. రెగ్యులర్ ట్యూన్స్ ఇవ్వడం కూడా మన సంగీత దర్శకులు చేస్తున్న ఓ పోరపాటు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: