టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా నిర్మాతలుగా మారుతున్నారు.. ఇప్పటికే మహేష్, రాం చరణ్, పవన్ ఇలా అందరు తమ సొంత ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ కూడా ఓన్ ప్రొడక్షన్ పెడుతున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ లోనే షేర్ ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఎటొచ్చి ఎన్.టి.ఆర్ కే సొంత బ్యానర్ లేదు. 


అందుకే ఎన్.టి.ఆర్ కూడా నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఎన్.టి.ఆర్ కొత్త బ్యానర్ ఎనౌన్స్ చేయబోతున్నాడట. అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా మహేష్ లాగా తన సినిమాలకే సహ నిర్మాతగా ఉంటాడా లేక రామ్ చరణ్ లాగా సొంత సినిమాలు చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.


అయితే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య బాలకృష్ణ కూడా ఎన్.బి.కే ఆర్ట్స్ అని ఎన్.టి.ఆర్ బయోపిక్ తీశాడు. నిర్మాతగా మారుతున్న ఎన్.టి.ఆర్ బ్యానర్ పేరు ఏది పెడతాడు అన్నది తెలియాల్సి ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నందమూరి ఆర్ట్స్ అని పెట్టొచ్చనే టాక్ వినిపిస్తుంది.     


ఎన్.టి.ఆర్ నిర్మాతగా నందమూరి సినిమాస్ లేదా నందమూరి ఆర్ట్స్ అనే బ్యానర్ లో కేవలం నందమూరి హీరోలే కాదు బయట హీరోల సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ఎన్.టి.ఆర్ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. టాలెంట్ ఉండి ఛాన్స్ కోసం ఎదురుచూసే వారికి తన బ్యానర్ లో సినిమా ఛాన్స్ ఇస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ సొంత బ్యానర్ కు కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టాడట. త్వరలోనే నందమూరి ఫ్యాన్స్ అందరు సర్ ప్రైజ్ అయ్యేలా బ్యానర్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: