అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ   నివేదాథామస్... టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ  గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ  వస్తుంది. ఇప్పుడు వరకు చాలా సినిమాల్లో  చేసినప్పటికీ ఏ సినిమాలో కూడా గ్లామర్ పాత్రలో మేరలేదు నివేదా థామస్ . అయితే గ్లామర్ పాత్రలు చేయక పోయినప్పటికీ తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన మెరిసి  ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమాలో హీరోయిన్ గా నటించింది నివేద థామస్. సినిమాలో నివేదాథామస్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. అయితే అటు సినిమాల్లోనే కాదు ఇది సోషల్ మీడియాలో కూడా తన అభిమానులకు...  సినిమా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తుంటుంది నివేదా థామస్



 ఇదిలా ఉండగా అప్పుడప్పుడు సోషల్ మీడియ సెలెబ్రిటీలు   అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ అలరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు కొంతమంది నెటిజన్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నెటిజన్ల అడిగే  కొన్ని ప్రశ్నలు సెలబ్రిటీలను  ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఘటన తాజాగా అందాల ముద్దుగుమ్మ  నివేద థామస్ కు ఎదురైంది. ఇస్టాగ్రామ్ లో అభిమానులతో  చాట్ చేస్తున్న ఈ అమ్మడికి చేదు అనుభవం ఎదురైంది. నివేద తామస్ అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో కొందరు అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని నివేద థామస్ తెలిపింది . దీంతో తనతో  చాట్ చేయడానికి సమయం కేటాయించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ చాటింగ్ ముగించింది .



 అయితే చాలా మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను అని తెలిపి నివేద థామస్... కొందరు నెటిజన్లు అడిగిన అసభ్యకర ప్రశ్నలు మాత్రం తనను చాలా ఇబ్బందికి గురిచేసాయి అంటూ తెలిపింది ఈ అమ్మడు. చాట్ చేసేది ఒక మనిషి తోనే అనే విషయం మర్చిపోవద్దు అని తెలిపిన నివేదాథామస్... అందరికీ మర్యాద ఇవ్వాలని కోరింది. తాము  సెలబ్రిటీల అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని  తమకు మర్యాద ఉంటుందని తెలిపింది ఈ అమ్మడు . త్వరలో మళ్ళీ కలుద్దాం అంటూ గుడ్ బై చెప్పేసింది ఈ అమ్మడు. కాగా  నివేద థామస్ కి ఇంస్టాగ్రామ్ లో మూడు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని  పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: