కోలీవుడ్ లో ఓ సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని తెలుగులో రీమేక్ చేయడం కామన్ అయ్యింది. అసలైతే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారు. కాని అసురన్ కు ఎందుకో అలా చేయలేదు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరక్షన్ లో వచ్చిన అసురన్ తమిళంలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 


ఇక ఈ సినిమా హిట్ అయ్యిందని తెలుసుకున్న టాలీవుడ్ మేకర్స్ రీమేక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసురన్ తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ బాబు పొందినట్టు తెలుస్తుంది. వెంకటేష్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అయితే ఈ రీమేక్ కు దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారు సురేష్ బాబు.


ఈమధ్య రాజు గారి గది దర్శకుడు ఓంకార్రీమేక్ ను డైరెక్ట్ చేస్తాడని అనుకోగా.. ఇప్పుడు రేసులో హను రాఘవపుడి వచ్చాడని తెలుస్తుంది. అసురన్ ఓ రా సబ్జెక్ట్. ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా తీయాలి. దానికి హను రాఘవపుడి పర్ఫెక్ట్ అని అతన్ని దాదాపుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు ఈ సినిమా నిర్మించారు.    


ధనుష్ నట విశ్వరూపం చూపించిన అసురన్ తెలుగు రీమేక్ లో వెంకటేష్ కూడా తన ప్రతాపం చూపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ వెంకీమామ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయిన వెంకీమామ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటిదాకా సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమా ప్రీ పోన్ అయినట్టు తెలిసింది. డిసెంబర్ 13న వెంకీమామ రిలీజ్ అన్నారు. కాని ఇప్పటివరకు ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు. అసలు ఇంతకీ డిసెంబర్ లో సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: