ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించి కండల వీరుడు అని పేరు తెచ్చుకునే వారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా సిక్స్ ప్యాక్ యాబ్స్ కోసం కష్టపడుతున్నారు. సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించాకా సోషల్ మీడియాలో గర్వాంగా సాధించా అంటూ సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపిస్తూ ఫోటో పెడుతారు. 
ఈ నేపథ్యంలోనే హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ హాలీ బెర్రీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పోస్ట్ ఏంటంటే.. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించటం కన్నా గొప్ప ఫీలింగ్‌ ఏది ఉండదు అని, త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న నా బ్రూజ్‌ మూవీ కోసం నేను సెట్ చేసుకున్ గోల్‌ సిక్స్‌ ప్యాక్‌ యాబ్స్‌ సాధించటం. ఈ రోజు నా గోల్ రీచ్‌ అయ్యాను.. ఈ విషయాన్నీ నేనే నమ్మలేకపోతున్నా అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 
ఈ సిక్స్‌ ప్యాక్‌ సాధించటంపై స్పందించిన ఆమె పర్సనల్ ట్రైనర్.. ఈ గోల్ సాదించటం హాలీకి అంత సులభంగా సాధ్యం కాలేదు.. హాలీ రోజుకు నాలుగు గంటల చొప్పున జిమ్ చేసేదని తెలిపాడు. అంతేకాదు.. ఆహారం విషయంలోనూ ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అప్పుడప్పుడు ఉపవాసం కూడా ఉండేదని.. అందుకే ఆమె సిక్స్‌ ప్యాక్‌ సాదించికగలిగిందని తెలిపారు. 
బాండ్‌ గర్ల్‌గా ఫేమస్‌ అయినా హాలీ బెర్రీ అకాడమీ అవార్డును అందుకుంది. ఈమె సినిమాలతో పాటు టీవీ షోస్‌లో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. నటిగా మాత్రమే కాదు నిర్మాతగానూ ఎన్నో సినిమాలను నిర్మించింది. కాగా త్వరలో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బ్రూయిజ్డ్‌ సినిమాలో నటిస్తోంది, ఈ సినిమాలో ఆమె సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: