రోజురోజుకు సినిమా ప్రేక్షకుల పంథా  మారుతూ వస్తోంది.  స్టార్ హీరోల సినిమాలు అయినా సరే  కంటెంట్ బాగుంటేనే సినిమాలను ఆదరిస్తున్నారు  ప్రేక్షకులు. ఈ క్రమంలో డైరెక్టర్లు కూడా సినిమాను తెరకెక్కించి స్టైల్ మార్చుకుంటున్నారు. ఒకప్పుడైతే నాలుగు పాటలు రెండు భారీ ఫైట్లు 3 కామెడీ సీన్లతో  సినిమాలు విజయం సాధించాయి. కానీ ఇప్పుడు కథలో బలం ఉన్న సినిమాలు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య రా కంటెంట్స్  కి బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్ రంగస్థలం సినిమా రా  కంటెంట్ ని  తెరకెక్కించి బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే.ఈ  సినిమాలో  రామ్ చరణ్ నటుడిగా ఎన్నో మెట్లు ఎదిగాడని చెప్పాలి. 



 అలాంటి రా కంటెంట్  తమిళ సినిమాని ప్రస్తుత తెలుగులో రీమేక్ చేయాలనీ ప్రయత్నాలు జరుగుతున్నాయి . తాజాగా తమిళ హీరో ధనుష్ నటించిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది . దళిత కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన్నట్లు సమాచారం. రంగస్థలం సినిమాలాగే  అసురన్  సినిమా కూడా రా కంటెంట్తో తెరకెక్కించ బడి మంచి విజయాన్ని అందుకుంది. నాచురలిటి కి దగ్గరగా ఈ సినిమా ఉంటుంది. అయితే సినిమాలో ధనుష్ నటనకు కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం వెంకటేష్ తో తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 



 హత్తుకునే భావోద్వేగాలు తో ఉండే ఈ సినిమా  అదరగొడుతుందని  అందుకే తెలుగులో రీమేక్ చేయాలని హీరో వెంకటేష్ భావిస్తున్నారట . కాగా ఈ సినిమా రీమేక్ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట నిర్మాత సురేష్ బాబు. అయితే చివరికి ఈ సినిమా  దర్శకుడిగా హను రాఘవపూడి ని  ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ దర్శకుడు ఇంతకుముందు అందాల రాక్షసి,  కృష్ణ గాడి వీర ప్రేమ కథ,  లై,  పడి పడి లేచే మనసు లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. కాగా  ఈ సినిమాకి హను రాఘవపూడి అయితేనే న్యాయం చేస్తారని నిర్మాత  సురేష్ బాబు  భావిస్తున్నారట. ఒకవేళ అంతా ఓకే అయితే ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: