ప్రభుదేవా అనగానే మనకు గుర్తొచ్చేది స్టైలిష్  డాన్స్. తన డాన్స్ తో  ఇండియన్ మైకెల్ జాక్సన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు ప్రభుదేవా. ప్రభుదేవా చేసే డాన్స్ స్టెప్పులు చూపరులను ఔరా  అనిపిస్తుంటాయి . ప్రభుదేవా లో ఏ సినిమాలో నటించిన అందులో ఫుల్ డాన్స్ మూమెంట్స్ కామనే. ఏబిసిడి  సినిమాల్లో అయితే ప్రభుదేవా డాన్స్ విశ్వరూపం చూపించారు. ఇక తెలుగులో కూడా స్టైల్ సినిమాలో ప్రభుదేవా డాన్స్ ని ఇరగదీశారు.తాజాగా  తమన్నా ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన అభినేత్రి సినిమాలో కూడా డాన్స్ తో అందరిని ఆకర్షించాడు  ప్రభుదేవా. అందుకే ప్రభుదేవని  ఇండియన్ మైకేల్ జాక్సన్ గా డాన్స్ అభిమానులు   పిలుచుకుంటారు. 



 అంతేకాదు కొత్తగా ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చే డాన్సర్లకు  చాలామందికి ప్రభుదేవా ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. అయితే ఒక్క డాన్స్ మాస్టర్ గానేకాదు దర్శకుడిగా కూడా ప్రభుదేవా కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకున్నాడు ప్రభుదేవా . సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాడు. అయితే ప్రభుదేవా ఏదైనా సాంగ్ డాన్స్ కంపోజ్ చేస్తున్నారు అంటే హీరోలు భయపడిపోతుంటారు. ఎందుకంటే ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేస్తే మూమెంట్స్  ఎంత కష్టంగా  ఉంటాయో  అందరికీ తెలిసిందే. 



 ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిస్తున్న రాదే  చిత్రంలో దిశా పటాని నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాగా.... ఓ సాంగ్ లో ప్రభుదేవాతో  డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ గ్లామర్ డాల్ దిశా పఠాని  తన మోకాళ్ళకు  గాయపరిచుకుంది . దీనికి  సంబంధించిన ఫోటో ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది  దిశాపటాని. ప్రభుదేవా పాట షూటింగ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్ పెట్టండి ఈ అమ్మడు. ఇటీవల సల్మాన్ ఖాన్ తో భారత్ సినిమాల్లో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇక తాజాగా రాధే  సినిమాలో నటిస్తూ సల్మాన్ ఖాన్ పక్కన మరో సారి ఛాన్స్ కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: