దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న rrr సినిమా పై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతగానో ఆత్రుతగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు అయినా జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటిసారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియా లోనే ఇది భారీ మల్టీస్టారర్ సినిమా అని చాలామంది సినిమా విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సగానికిపైగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమా నుండి ఇటీవల ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో దీన్ని క్యాష్ చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన పిక్స్ అంటూ విడుదల చేసి వైరల్ చేయగా వెంటనే rrr సినిమా టీం అలర్ట్ అయ్యి విడుదలైన ఫోటోలను చూసి జాగ్రత్త పడ్డారు. అయితే విడుదలైన ఫోటోలు ఫ్యాన్ మేడ్ పిక్స్ కావడంతో...ఊపిరిపీల్చుకున్న సినిమా యూనిట్ ఇకపై షూటింగ్ జరిగే సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారట.


దీంతో ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్లు ఇది మంచి పద్ధతి కాదని, కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే, ఈ విధంగా తప్పుడు పద్ధతుల్లో వాటిని లీక్ చేయడం వంటివి చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క సినిమా షూటింగ్ కొద్దిగా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి చెప్పిన డేట్ ప్రకారం వచ్చే సంవత్సరం జులై 30వ తారీఖున విడుదల చేయటానికి పక్కా ప్లానింగ్ తో కొత్త షెడ్యూల్ రెడీ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ rrr సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: