తమిళ్ సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిబింబాలుగా చెప్పవచ్చు. నటనలోనూ, స్టార్ ఇమేజ్ లోనూ తిరుగులేని స్థాయి అందుకున్న ఇద్దరూ అప్పట్లో ఒకరికి ఒకరు పోటీ అయినా సరే ఎంతో సన్నిహితంగా ఉండేవారు. బాలచందర్ స్కూల్ నుంచే వచ్చిన వీరిరువురు మొదట్లో కలిసి సినిమాలు చేశారు కూడా. తమిళ సినిమాకు రెండు కళ్లుగా చెప్పబడే వీరిరువురు తర్వాత వ్యక్తిగత జీవితంలో దారులు భిన్నంగా సాగినప్పటికీ వారి స్నేహం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది.

ఇద్దరూ విడివిడిగా పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కమల్ హాసన్ తన గురువు బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అక్కడికి రజినీకాంత్ కూడా వచ్చాడు. కమల్ తో కలిసి బాలచందర్ కు నివాళులు అర్పించాడు. ఇదే సమయంలో తమ ఇరువురి స్నేహ బంధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కమల్ పంచుకున్నాడు. ఇందుకు సంబంధించి మణిరత్నం దర్శకత్వంలో రజిని కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన 'దళపతి' సినిమా నాటి సంగతులను ఆయన గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పాడు.

మణిరత్నం తో తాను ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పిన రజిని ఆ సినిమా పేరు 'దళపతి' గా పెడుతున్నట్లు కమల్ కి తెలిపాడట. పేరు వినగానే ఆ టైటిల్ తనకు నచ్చలేదని కోపంతో మొహం మీదే బాగా లేదని చెప్పడంతో రజిని నొచ్చుకున్నాడు. అయితే సినిమా టైటిల్ అంత బాగుంటే కమల్ కు ఎందుకు నచ్చలేదు అని మీకు అర్థంకాలేదా? అసలు సంగతి ఏమిటంటే రజనీ చెప్పిన టైటిల్ తనకు 'దళపతి' కి బదులుగా 'గణపతి' అని వినిపించిందట. అందుకే ఆ టైటిల్ బాగాలేదని కమల్ తెలిపాడు. ఇదేదో వినాయకచవితి పండగలా ఉంది అని కామెంట్ చేస్తే దీంతో రజనీ అర్థం కాక మరొక సారి టైటిల్ గురించి వివరిస్తే అప్పుడు తనకి టైటిల్ 'దళపతి' అని అర్థమై చాలా బాగుంది అని చెప్పినట్లు కమల్ వెల్లడించాడు. ఈ మధ్య కూడా రజనీ తాను సినిమాలు మానేద్దాం అనుకుంటున్నట్లు చెబితే అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోవద్దని కమల్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: