సుడిగాలి సుదీర్ పేరు తెలియని  ప్రేక్షకుడు లేడు.  జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారి అందరికీ సుడిగాలి సుదీర్ గా సుపరిచితుడు అయ్యాడు . ఇక జబర్దస్త్ లో తనదైన కామెడీతో అందరికీ నవ్వులు పంచేవాడు  సుధీర్. జబర్దస్త్ కమెడియన్స్  లో అందరికంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించాడు. జబర్దస్త్ యాంకర్ రష్మీ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా   కవరింగ్ ఇస్తూ బాగానే క్రేజ్ సంపాదించాడు సుధీర్. ఇక సుధీర్ ఒక్క జబర్దస్త్ షో  ద్వారానే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ  ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఢీ లో సుదీర్ చేసే కామెడీ ప్రతి ఒక్క  బుల్లితెర ప్రేక్షకొన్ని  కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. అయితే ఢీ షో లో సుధీర్ కామెడీ తోనే కాదు తన డాన్స్ తో కూడా అదరగొడుతున్నాడు. సూపర్ డాన్స్ లతో బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు సుధీర్. 



 ఇక అప్పుడప్పుడు మ్యాజిక్ షో కూడా చేస్తూ తన అభిమానులను మాయలో ముంచెత్తుతున్నాడు సుధీర్. ఓవైపు కామెడీ... మరోవైపు డాన్స్... ఇంకోవైపు మ్యాజిక్ షో ఇలా  అన్నింటిలో తన సత్తా చాటి మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు సుధీర్. అయితే ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు సుడిగాలి సుదీర్. అయితే సుధీర్ కి అమ్మాయిల్లో కూడా క్రేజ్ బాగానే ఉంది. కాగా సాఫ్ట్ వెర్ సుధీర్  అనే  సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుడిగాలి సుదీర్. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సాఫ్ట్ వేర్  సుదీర్ అనే సినిమాకు సంబంధించిన పాటలు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జబర్దస్త్ లో జడ్జిల్లో   ఒకరైన రోజా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా సుధీర్ ని  ఆకాశానికి ఎత్తేసారు.



 సుడిగాలి సుదీర్ సినిమా పాటలను తన చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సుధీర్ మా  కళ్ళ ముందే ఎదిగాడని మల్టీ టాలెంటెడ్ అంటూ చెప్పుకొచ్చారు . అయితే సుధీర్ డాన్స్ పర్ఫార్మెన్స్ లు చూసినప్పుడల్లా చాలాసార్లు హీరోగా సినిమాలు చేయాలని సలహా ఇచ్చినట్టు రోజా చెప్పుకొచ్చారు. మేము అనుకున్నట్టుగానే సుధీర్ హీరోగా ఎదిగారని  రోజు అన్నారు . అయితే ఇప్పటివరకు టీవీ షోల్లో  మాత్రమే కనిపించిన సుధీర్  ఇప్పుడు కమర్షియల్ లవర్ బాయ్ గా  సినిమాల్లో కూడా చూడబోతున్నాం అని తెలిపారు. అయితే సుధీర్ తో పాటు టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రోజా. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: